Periods: ఆ సమయంలో మహిళలు గుడ్డు తినొచ్చా…?
పీరియడ్స్ సమయంలో మహిళలు...కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
- By Hashtag U Published Date - 03:36 PM, Mon - 7 February 22

పీరియడ్స్ సమయంలో మహిళలు…కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆ సమయంలో నొప్పి, వికారం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే నెలసరి సమయంలో కోడి గుడ్డు తినవచ్చా లేదా అనే విషయంలో చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. అసలు ఆ సమయంలో గుడ్డు తినవచ్చా లేదా అనేదానిపై నిపుణులు ఏం చెబుతున్నారనంటే…
నెలసరి సమయంలో ప్రతి మహిళలకు చాలా సున్నితమైన దశ. ఈ టైంలో చాలామంది కడుపునొప్పి, మూడ్ స్వింగ్స్, వెన్నునొప్పి వంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు. అయితే ఆ టైంలో వారు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నెలసరి సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాల్సిందే. ఎందుకంటే వాటితో ఆ నొప్పి మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది.
గర్భవతులు కానీ, పీరియడ్స్ సమస్యను ఎదర్కొనేవారు కానీ ఆ సమయంలో ఎక్కువగా గుడ్లు తినేందుకు ఇష్టపడుతుంటారు. ఎందకంటే సులభంగా తయారు చేసుకునే ఫుడ్ ను తింటారు. అందులోనూ గుడ్డుతో తయారు చేసే ఆహారానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే గుడ్లతో తయారు చేసే ఫుడ్ నిమిషాల్లో తయారవుతుంది. ఇక కొంతమంది మాత్రం పీరియడ్స్ సమయంలో గుడ్లు తినొద్దని చెబుతుంటారు.
గుడ్డులో ఉండే విటమిన్లు, బి6 , డి, ఈ పుష్కలంగా ఉంటాయి. అయితే గుడ్లను తింటే మనకు ఎంపిఎస్ లక్షణాలతో పోరాడే శక్తి లభిస్తుంది. అంతేకాదు వీటిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే పొట్ట నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంతేకాదు గుడ్డులో క్యాల్షియం, భాస్వరంగా పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల ఎముకలు ధ్రుఢంగా ఉంటాయి. వీటిలో ఉండే జింక రోగ నిరోధక శక్తి కూడా బలపడుతుంది. ఒక గుడ్డు ద్వారా 125.5మిల్లిగ్రాముల కొలిన్ అందుతుంది. ఇది మెదడుకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంతేకాదు గుడ్డును తినడం వల్ల హెచ్డిఎల్ లెవల్స్ పెరుగుతాయి. అయితే చాలామంది గుడ్డు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని అపోహ పడుతుంటారు. నిజానికి గుడ్లను మోడరెట్ సైజ్ లో తీసుకుంటే హార్ట్ స్ట్రోక్, హార్ట్ ప్రాబ్లమ్స్ ను తగ్గించుకోవచన్ని నిపుణులు చెబుతున్నారు.
ఉడకబెట్టిన గుడ్లు, జుట్టు, గోళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ గుడ్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. కోడిగుడ్డలో ఐరన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది.
అంతేకాదు ఈ ఐరన్ను మన శరీరం చాలా ఫాస్ట్ గా గ్రహిస్తుంది. గర్బిణిలకు బాలింతలకు క్రమం తప్పకుండా బాయిల్డ్ ఎగ్స్ ఇస్తుండాలి. కళ్ల ఆరోగ్యానికి గుడ్డు ఎంతో ఉపయోగపడుతుంది. క్యాల్షియం, పొటాషియం, బోన్స్ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.
ఇక నరాల బలహీనతతో బాధపడేవారు గుడ్డు ప్రతిరోజూ తింటుండాలి. ఇలా తీసుకున్నట్లయితే నరాల బలహీనత సమస్య క్రమంగా తగ్గుతుంది. గుండె సంబంధిత సమస్యల నివారణకు ఈ గుడ్డు తోడ్పతుంది. వారానిిక ఆరు గుడ్లు తప్పనిసరిగా తినాలి. ఇలా తిన్నట్లయితే ఆడవారిలో 44శాతం రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని పలు అధ్యయానాల్లో తేల్చాయి. కాబట్టి పీరియడ్స్ సమయంలో కూడా ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా గుడ్లను తినాలి.