Orange Juice: ప్రతీ రోజూ ఆరెంజ్ జ్యూస్ తాగితే ఏమవుతుందో మీకు తెలుసా?
ఆరెంజ్ జ్యూస్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది అలాంటి ఆరెంజ్ జ్యూస్ ని ప్రతిరోజు తాగితే ఏం జరుగుతుందో ఎటువంటి మార్పులు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:00 PM, Wed - 14 May 25

ఆరెంజ్ జ్యూస్ వల్ల అనేక లాభాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. ఆరెంజ్ జ్యూస్ వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందట. ఇది మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుందట. దీని వల్ల మనకు తొందరగా జలుబు, దగ్గు వంటి ఫ్లూ, ఇతర ఇన్ ఫ్లమేటరీ వ్యాధుల నుంచి కాపాడటంలో సహాయం చేస్తుందట. అలాగే ఆరోగ్యం కాపాడటంలో సహాయపడుతుందట. మీరు డల్ స్కిన్ తో బాధపడుతున్నట్లయితే ఆరెంజ్ జ్యూస్ తాగితే సరిపోతుందట.
ఈ జ్యూస్ మీ స్కిన్ పై అద్భుతాలు చేస్తుందట. ఇందులో విటమిన్ సి మాత్రమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్ యాక్టివిటీతో పోరాడడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయట. ఫ్రీ రాడికల్స్ మీ చర్మాన్ని నిస్తేజంగా కనిపించేలా చేస్తాయట. ముడతలు, వృద్ధాప్యాన్ని ప్రోత్సహిస్తాయని చెబుతున్నారు. ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల యవ్వనం, కాంతి వంతమైన చర్మాన్ని పొందవచ్చట. దీని వల్ల మీ అందం కచ్చితంగా పెరుగుతుందని చెబుతున్నారు. ఆరెంజ్ జ్యూస్ లో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుందట. ఇది మీ ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుందని, వాటిని బలంగా ఉంచుతుందని,మన అస్థిపంజరం అన్ని ఎముకలు కాబట్టి నిర్మాణాన్ని బలంగా ఉంచడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు.
కాగా నారింజలో అధిక మొత్తంలో సిట్రేట్ గాఢత ఉంటుంది. అంటే మీరు ఆరెంజ్ జ్యూస్ తాగినప్పుడు, అది కాల్షియం ఆక్సలేట్ స్టోన్ ఫార్మేషన్ ను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుందట. మూత్రపిండాల్లో రాళ్ల నుండి ఉపశమనం పొందవచ్చని అంతేకాదు హైపర్ టెన్షన్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. నారింజలో ఉండే పెక్టిన్, లిమినాయిడ్ సమ్మేళనాలు ధమనుల గట్టి పడటాన్ని తగ్గించడంలో సహాయపడతాయట. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తాయట. నారింజ పండ్లను జ్యూస్ చేయడం కంటే ప్యాక్ చేసిన జ్యూస్ ని కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. మార్కెట్ లో కొనుగోలు చేసే ఆరెంజ్ జ్యూస్ లలో ఎక్కువ భాగం పంచదారతో ప్యాక్ చేసి ఉంటాయి. రుచిగా ఉండేలా రంగులు, ప్రిజర్వేటివ్ లను జోడిస్తారు. మీరు ఇంట్లో నారింజ పండ్లను జ్యూస్ చేస్తున్నప్పటికీ, మీరు 3 నుంచి 4 నారింజలను ఉపయోగిస్తున్నారు. ఇది రోజుకు చాలా చక్కెర వినియోగం కావచ్చని చెబుతున్నారు.