HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >E Challan Scam In Ap

E Challan Scam : ఏపీలో ఈ – చలానా స్కామ్..ఎన్ని కోట్లు కొట్టేసారో తెలుసా..?

ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనల పేరుతో ప్రజల నుంచి జరిమానాల రూపంలో వసూలు చేసిన మొత్తంలో రూ.36.53 కోట్లు దారి మళ్లాయి

  • By Sudheer Published Date - 08:59 AM, Fri - 20 October 23
  • daily-hunt
E Challan Scam In Ap
E Challan Scam In Ap

ఏపీలో పలు స్కామ్ కేసులు సంచలనంగా మారాయి. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ (Skill Development Scam) , ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ (Amaravati Inner Ring Road Scam) లు వార్తలు నిలువగా..తాజాగా ఈ – చలానా స్కామ్ (E Challan Scam) ఇప్పుడు అంత మాట్లాడుకునేలా చేసింది. ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనల పేరుతో ప్రజల నుంచి జరిమానాల రూపంలో వసూలు చేసిన మొత్తంలో రూ.36.53 కోట్లు దారి మళ్లాయి. ఈ స్కామ్ పై గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు ( IG Pala Raju) వివరాలు వెల్లడించారు. కొమ్మిరెడ్డి అవినాష్ (Avinash Kommireddi) కు చెందిన రేజర్ పీఈ ఖాతాకు డబ్బంతా మళ్లించారని, దీంతో పీఈ ఖాతా నుంచి నగదు డీజీ ఖాతాకు జమ కాలేదన్నారు. ఈ విషయాన్ని సెప్టెంబరులో తిరుపతి యూనిట్ లో గుర్తించామని తెలిపారు.

ఈ కుంభకోణంలో ప్రధాన నిందితులు విశ్రాంత డీజీపీ నండూరి సాంబశివరావు అల్లుడు కొమ్మిరెడ్డి అవినాశ్‌, ఆయన చెల్లెలు అక్షిత, రవికిరణ్‌ అనే మరో వ్యక్తి కీలక నిందితులు’’ అని గుంటూరు రేంజ్‌ ఐజీ పాలరాజు తెలిపారు. ఈ చల్లాన్ ద్వారా రూ.101 కోట్లకు పైగా వసూలు చేసిన డేటా ఇవాల్వ్ సంస్థ.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తంలో కొంత భాగాన్ని సొంత ఖాతాలకు తరలించారు. డేటా సొల్యూషన్ ప్రతినిధి రాజశేఖర్ ను ప్రశ్నించినట్లు చెప్పారు. సరైన సమాచారం ఇవ్వకుండా అవినాష్ కాలయాపన చేశారని, అందుకే రాజశేఖర్ ను అరెస్ట్ చేసి విచారించగా, నిధుల దుర్వినియోగం చేసినట్లు అంగీకరించాడని వెల్లడించారు. ఈ క్రమంలో అవినాష్ ఆస్తుల విషయమై సబ్ రిజిస్ట్రార్ కు లేఖ రాశామని, ఆస్తుల క్రయ విక్రయాలు నిలిపేసేలా చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. త్వరలోనే అవినాష్ ను పట్టుకుంటామని ఐజీ పాలరాజు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘2015నుంచి పోలీస్‌శాఖ ఈ చలాన్‌ను కృష్ణా సొల్యూషన్స్‌ అనే సంస్థ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ ద్వారా వసూలు చేసేది. ఇందుకుగాను రూ.5 యూజర్‌ చార్జీ వసూలు చేసేవారు. ఆ సంస్థ సమర్థంగా పనిచేయడంలేదనే కారణంతో 2017 జూన్‌ నుంచి డాటా ఇవాల్వ్‌ అనే సంస్థ సేవలు వినియోగించుకున్నాం. 2018 డిసెంబరులో ఈ చలాన్‌ వసూళ్లకు సంబంధించి రూ.2కోట్లు చెల్లించే విధంగా ఓపెన్‌ టెండర్‌ పిలిచాం. ఇందులో కృష్ణా సొల్యూషన్స్‌ సంస్థ ఏడాదికి 1.97 కోట్లు కోట్‌ చేయగా, డాటా ఇవాల్వ్‌ సంస్థ ఒక్క రూపాయి కోట్‌ చేసింది. అదేమిటంటే… లాభాపేక్ష లేకుండా నిర్వహించి ఆ తర్వాత మిగిలిన రాష్ర్టాలకు విస్తరించుకుంటామని వారు చెప్పారు. దీంతో ఈ కాంట్రాక్ట్‌ను డాటా ఇవాల్వ్‌ సంస్థకు కేటాయించాం. కొమ్మిరెడ్డి అవినాశ్‌, ఆయన చెల్లెలు అక్షిత, రవికిరణ్‌ అనే మరోవ్యక్తి ఈ సంస్థను నిర్వహిస్తున్నారు. ఆ సంస్థ 2019 నుంచి ఈ చలాన్‌ సొమ్మును పేటీఎం, ఏపీ ఆన్‌లైన్‌, మీసేవ, కార్డ్స్‌, జాక్‌ పే, మోబికిక్‌, రజోర్‌ పే… ఇలా అనేక గేట్‌వేల ద్వారా డీజీపీ ఖాతాలోకి జమ చేస్తున్నట్లు పాలరాజు తెలిపారు.

Read Also : BRS Votes to TRS : బీఆర్ఎస్‌ ఓట్లు టీఆర్ఎస్ కు..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • e-Challan Scam

Related News

Lokesh Google

Lokesh US Tour : పెట్టుబడులే లక్ష్యంగా లోకేష్ యూఎస్ టూర్

Lokesh US Tour : రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడం మరియు ప్రవాసాంధ్రులతో (NRIలు) అనుబంధాన్ని బలోపేతం చేసుకోవడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా ఉంది

  • Chandrababu

    CBN : మెరుగైన పాలన దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం

  • New Districts In Ap

    New Districts in AP : ఏపీలో రెండు కొత్త జిల్లాలు, 4 రెవెన్యూ డివిజన్లు!

  • Grama Panchayat Election In

    Grama Panchayat Election : ఏపీలో మళ్లీ ఎన్నికల జాతర

  • Venkatrao Gannavaram

    Gannavaram : గన్నవరం అభివృద్ధి కోసం యార్లగడ్డ వెంకట్రావు

Latest News

  • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

  • Battery Tips: మీ ఈవీ బ్యాటరీ ఎక్కువ కాలం వ‌చ్చేలా చేసే టిప్స్ ఇవే!

  • Cheteshwar Pujara: క్రికెటర్ పుజారా బావమరిది ఆత్మహత్య.. కార‌ణ‌మిదే?!

  • Commonwealth Games: అహ్మదాబాద్‌లో చరిత్రాత్మక ఘట్టం.. 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య నగరం ఖరారు!

  • Rare Earths Scheme: చైనా ఆంక్షల మధ్య భారత్ కీలక నిర్ణయం.. రూ. 7,280 కోట్లతో!

Trending News

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

    • Constitution Day : ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం

    • Mumbai 26/11 Terror Attack : ముంబై మారణహోమానికి 17 ఏళ్లు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd