Irregular Periods: పీరియడ్స్ తరచుగా రావాలంటే.. ఇలా చేయాల్సిందే?
మామూలుగా స్త్రీలకు ప్రతినెల పీరియడ్స్ రావడం అన్నది సహజం. అయితే కొన్ని కొన్ని సార్లు స్త్రీలకు నెలసరి సమయం కాస్త అటు ఇటుగా కూడా ఉంటుంది. కొం
- By Anshu Published Date - 06:00 PM, Fri - 1 September 23

మామూలుగా స్త్రీలకు ప్రతినెల పీరియడ్స్ రావడం అన్నది సహజం. అయితే కొన్ని కొన్ని సార్లు స్త్రీలకు నెలసరి సమయం కాస్త అటు ఇటుగా కూడా ఉంటుంది. కొంతమందికి రెగ్యులర్గా డేట్ మిస్ అవ్వకుండా వస్తే మరి కొంత మందికి కొన్ని కొన్ని సార్లు తేదీ మించి లేదా ముందుగానే పీరియడ్స్ వస్తూ ఉంటాయి. పీరియడ్స్ ఆలస్యంగా రావడం లేదంటే మామూలుగా వచ్చే సమయానికంటే ముందుగా రావడానికి అనేక రకాల కారణాలు కూడా ఉన్నాయి.. అలా రావడం మంచిది కాదు అంటున్నారు నిపుణులు.
మరి పీరియడ్స్ తరచుగా రావాలి అంటే ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం బెస్ట్ ఆప్షన్. ఒత్తిడి కారణంగా పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉండకుండా ఇరెగ్యులర్ పీరియడ్స్ సమస్యతో బాధపడతారు. ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం చేయడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తాయి. అలాగే సరైన నిద్ర బాడీని హెల్దీగా మారేలా చేస్తుంది. దీని కారణంగా, శరీర విధులు సరిగ్గా జరిగేలా ఉంటుంది. హార్మోన్ల బ్యాలెన్స్ కాపాడుకోవడానికి తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి.. మీరు తరచుగా హైడ్రేట్‌గా ఉండడం చాలా ముఖ్యం. దీని వల్ల పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉంటాయి.
శరీరంలోని హార్మోన్లని బ్యాలెన్స్ చేయడానికి హైడ్రేటెడ్‌గా ఉండడటం చాలా ముఖ్యం. బరువు తక్కువగా ఉండడం, అధిక బరువు కూడా పీరియడ్స్‌ని ఎపెక్ట్ చేస్తాయి. కాబట్టి, రెగ్యులర్‌గా వర్కౌట్ చేయడం, సరైన లైఫ్‌స్టైల్‌తో బరువుని మెంటెయిన్ చేయచ్చు. దీని వల్ల పీరియడ్స్ రెగ్యులర్‌గా చేసుకోవచ్చు. శరీరంలో పోషకాలు లేకపోవడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్ రాకపోవచ్చు. కాబట్టి, మీ ఆహారంలో హెల్దీ ఫుడ్‌తో పాటు పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోండి. పోషకాహారం తీసుకోవాలి. వీటి వల్ల శరీరంలోని చాలా సమస్యలు దూరమవుతాయి. రెగ్యులర్‌గా పీరియడ్స్ రాకపోతే దానికి తోడు చాలా సమస్యలు వస్తాయి. అందుకే పీరియడ్స్‌ని రెగ్యులర్ చేసుకోవాలి. ఈ చిట్కాలు పాటించినప్పటికీ పీరియడ్స్ రాకపోతే వైద్యుని సంప్రదించడం మంచిది.