Red Banana: ఎర్రటి అరటిపండు వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
మార్కెట్లో మనకు ఎన్నో రకాల పండ్లు లభిస్తూ ఉంటాయి.. అందులో అరటి పండ్లు కూడా ఒకటి. ఈ అరటి పండ్లు ఏడాది పొడవునా సీజన్ తో సంబంధం లేకుం
- Author : Anshu
Date : 13-06-2024 - 3:04 IST
Published By : Hashtagu Telugu Desk
మార్కెట్లో మనకు ఎన్నో రకాల పండ్లు లభిస్తూ ఉంటాయి.. అందులో అరటి పండ్లు కూడా ఒకటి. ఈ అరటి పండ్లు ఏడాది పొడవునా సీజన్ తో సంబంధం లేకుండా అన్ని సీజన్ లలో లభిస్తూ ఉంటాయి. ఈ అరటిపండ్లలో కూడా అనేక రకాలు ఉన్నాయి. పసుపుపచ్చని అరటి పళ్ళు, ఎర్రని అరటి పండ్లతో పాటుగా ఇంకా చాలా రకాల అరటి పండ్లు లభిస్తూ ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి. మామూలుగా మనం ఎక్కువ శాతం పసుపుపచ్చని అరటి పండ్లు మాత్రమే తింటూ ఉంటాం. ఎర్రటి అరటి పండ్లు మార్కెట్లో చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటాయి.
ఈ అరటి పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు. మరి ఈ ఎర్రటి అరటి పండ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎర్రటి అరటిపండ్లలోని ఫైబర్ బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఇది ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. మీ జీర్ణవ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది. ఇది బరువు తగ్గించే ప్రయత్నాలకు పరోక్షంగా మద్దతు ఇస్తుంది. బరువు తగ్గాలి అనుకున్న వారికి ఎర్రటి అరటి పండ్లు ఒక చక్కటి మంచి ఎంపిక అని చెప్పాలి.
అలాగే ఈ ఎర్రటి అరటిపండ్లలో బీటా కెరోటిన్, విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరం ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడటానికి, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు సమర్థవంతమైన జీవక్రియకు మద్దతు ఇస్తాయి. తీపి రుచి ఉన్నప్పటికీ, ఎరుపు అరటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. మధ్యస్థ పరిమాణంలో ఉండే ఎర్రటి అరటిపండులో దాదాపు 90 కేలరీలు ఉంటాయి. ఇది మీ ఆహారంలో చేర్చుకోవటం మంచిది. ఎర్ర అరటిపండ్లలోని సహజ చక్కెరలు ప్రాసెస్ చేసిన స్నాక్స్‌తో వచ్చే క్యాలరీ భారం లేకుండా శీఘ్ర శక్తిని అందిస్తాయి. పసుపు అరటితో పోలిస్తే ఎరుపు అరటిపండ్లు కొన్ని యాంటీ ఆక్సిడెంట్ల సాంద్రతలను కలిగి ఉంటాయి. అదేవిధంగా ఈ ఎర్రటి అరటి పండ్లు కళ్ళకు ఎంతో బాగా ఉపయోగపడతాయి. ప్రతిరోజు వీటిని తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. ఎర్రటి అరటిపండు తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ పేషెంట్లు కూడా వీటిని ఎలాంటి భయం లేకుండా తినవచ్చు.