Hiccups : ఎక్కిళ్లు ఎక్కువగా వస్తున్నాయా.. అయితే వీటిని బాటిస్తే చాలు వెక్కిళ్లు మాయం?
మామూలుగా అప్పుడప్పుడు మనకు ఎక్కిళ్లు రావడం అన్నది సహజం. కొన్ని కొన్ని సార్లు అన్నం తినేటప్పుడు, అలాగే ఇతర సందర్భాలలో ఇలా ఎక్కిళ్లు వస్తూ ఉం
- By Nakshatra Published Date - 05:04 PM, Fri - 26 January 24
మామూలుగా అప్పుడప్పుడు మనకు ఎక్కిళ్లు రావడం అన్నది సహజం. కొన్ని కొన్ని సార్లు అన్నం తినేటప్పుడు, అలాగే ఇతర సందర్భాలలో ఇలా ఎక్కిళ్లు వస్తూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు చాలామంది ఎవరో తలుచుకుంటున్నారు అని అంటూ ఉంటారు. అప్పుడు కొన్ని మంచినీళ్లు తాగి వాటంతట అవే పోతాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు ఎన్ని నీళ్లు తాగినా కూడా కంటిన్యూగా అలాగే ఎక్కిళ్లు వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కిళ్లు తగ్గడం కోసం చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మామూలుగా ఎక్కిళ్లు వచ్చినప్పుడు వెంటనే తగ్గిపోతాయి. కాసిన్ని మంచినీళ్లు తాగినా తగ్గిపోతాయి.
ఎక్కువ సార్లు ఎక్కిళ్లు వస్తే మాత్రం ప్రాణాయామం చేస్తే వెంటనే తగ్గిపోతాయి. కొందరికి ఎక్కిళ్లు ఏం చేసినా అస్సలు తగ్గవు. అటువంటి వాళ్లు కొన్ని చిట్కాలు పాటిస్తే వెంటనే ఎక్కిళ్లు తగ్గిపోతాయి. లంగ్స్ లో ఫ్రీనిక్ అనే ఓ నాడి, వేగస్ అనే మరో నాడి ఇవన్నీ కలిసి గొంతులోని కండరాలను కదిలిస్తాయి. దాని వల్ల ఎక్కిళ్లు వస్తాయి. ఒక్కోసారి ఆందోళనగా ఉన్నా చిరాకుగా ఉన్నా నిద్రపట్టకపోయినా కూడా ఎక్కిళ్లు వస్తాయి. మానసిక ఒత్తిడికి గురయినా కూడా ఎక్కిళ్లు వస్తాయి. ఎక్కువ పులుపు ఉన్న ఆహారాన్ని తీసుకున్నా ఎక్కిళ్లు వస్తాయి. ఎక్కువ నూనె ఉన్న ఆహారాన్ని తీసుకున్నా కూడా ఎక్కిళ్లు వస్తాయి.
అయితే పదేపదే ఎక్కిళ్లు వస్తూ ఉంటే బార్లీ గింజలు ఉడికించి వాటిలో కాసింత పెరుగు పోసి చిలకాలి. అది మజ్జిగలా అవుతుంది. అప్పుడు దాన్ని తాగితే ఎక్కిళ్లు తగ్గుతాయి. యోగాసనాలు వేసినా మెడిటేషన్ చేసినా ఎక్కిళ్లు తగ్గుతాయి. కొబ్బరి పాలు తాగినా కూడా ఎక్కిళ్లు తగ్గుతాయి. జొన్నలతో చేసిన పేలాలు, బిరియాని ఆకు, మరమరాలను తిన్నా కూడా ఎక్కిళ్లు తగ్గుతాయి. ఎక్కిళ్లు పదే పదే వేధిస్తే.. ధనియాలు, జీలకర్ర, శొంఠితో చేసిన మిశ్రమంలో కాసింత ఉప్పు వేసి దాన్ని నిల్వ చేసుకొని ఎక్కిళ్ల సమస్య వచ్చినప్పుడు ఒక స్ఫూన్ మిశ్రమాన్ని గ్లాస్ మజ్జిగతో కలిపి తీసుకోవాలి. ఎక్కిళ్లు ఎప్పుడు వచ్చినా.. ఇలా చేస్తే వెంటనే ఎక్కిళ్లు తగ్గిపోతాయి. అలాగే కొంచం అల్లం రసం తీసుకున్న కూడా వెంటనే ఎక్కిళ్ళు తగ్గుతాయి..
Related News
White Hair: తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఈ సింపుల్ చిట్కా ఉపయోగించాల్సిందే?
ప్రస్తుతం రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చిన్న వయసు లోనే తెల్ల జుట్టు సమ