Nasal Congestion: ముక్కు దిబ్బడతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!
దగ్గు,జలుబు,ముక్కు దిబ్బడ సమస్యతో ఇబ్బంది పడేవారు వెంటనే చిట్కాలను పాటించాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 11:27 AM, Tue - 29 October 24

మామూలుగా వాతావరణం చేంజ్ అయినప్పుడు లేదంటే ఏదైనా చల్లని పదార్థాలు వంటివి తీసుకున్నప్పుడు దగ్గు జలుబు వంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొన్నిసార్లు ముక్కు దిబ్బడ కారణంగా చాలామంది తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంటారు. రాత్రి సమయంలో అయితే సరిగ్గా శ్వాస అందగా నిద్ర కూడా పట్టదు. చిన్నపిల్లల్లో కూడా ఈ సమస్యను మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ ముక్కుదిబ్బడ దగ్గు జలుబు సమస్య నుంచి ఉపశమనం పొందడం కోసం చాలా రకాల మెడిసిన్స్ ని ఉపయోగించడంతో పాటు కొందరు ఇంట్లోనే కొన్ని హోమ్ రెమెడీస్ ని కూడా ఫాలో అవుతూ ఉంటారు.
అలాంటప్పుడు కొన్ని రెమెడీస్ ఫాలో అయితే ఈ ముక్కు దిబ్బడ ఇబ్బంది నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయాన్ని వస్తే.. ఉప్పు కలిపిన నీటిని ముక్కులో వేసుకోవడం వల్ల తేమ పెరుగుతుంది. తద్వారా ముక్కుదిబ్బడ తగ్గుతుందని చెబుతున్నారు.. ఉప్పునీరు ముక్కులో ఉండే వ్యక్తాలను తొలగించే శ్వాసనాలను శుభ్రపరిచే శ్వాస అందే విధంగా చేస్తాయట. ఇందుకోసం గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు కలిపి ఆ ద్రావణాన్ని ముక్కులో వేసుకోవాలి చెబుతున్నారు. మరొక రెమిడీ విషయానికి వస్తే.. వేప నూనె లేదా యూకలిప్టస్ ఆయిల్ తో ముక్కుదిబ్బడను తగ్గించుకోవచ్చట. ఈ నూనెలను ఆవిరి పట్టడం వల్ల శ్వాస నాళాల్లో ఉండే శ్లేష్మాన్ని కరిగించి, శ్వాస మార్గాలను సాఫీగా చేస్తాయని చెబుతున్నారు.
అలాగే ఆవిరి పట్టడం ద్వారా ముక్కులోని శ్లేష్మాన్ని సులభంగా కరిగించి, దిబ్బడను తగ్గించుకోవచ్చు. ఒక పాత్రలో వేడి నీటి ఆవిరిని దుప్పటి కప్పుకుని శ్వాసగా తీసుకోవాలి. దీని వల్ల ముక్కులో ఉండే శ్లేష్మం త్వరగా కరుగుతుంది. అలాగే దగ్గు జలుబు చేసినప్పుడు చల్లనీరుకు బదులుగా గోరువెచ్చని నీరు తాగడం వల్ల ముక్కులో ఏర్పడిన అదనపు శ్లేష్మాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. ఇది శరీరానికి తేమను అందించి శ్వాస మార్గాలను తెరిచి, ముక్కులో నెమ్మదిగా శ్వాస తీసుకోవడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే అల్లం రసానికి తేనె కలిపి తీసుకుంటే ముక్కు దిబ్బడ తగ్గుతుందట. అలాగే అల్లం కషాయం వెచ్చగా తాగినా మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. అల్లం లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శ్వాస మార్గాలను సాఫీ చేస్తాయి. ఒక టీ స్పూన్ అల్లం రసం, ఒక టీ స్పూన్ తేనె కలిపి తాగడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.