Apple Side Effects: యాపిల్స్ అతిగా తింటే ఏం జరుగుతుందో తెలుసా?
యాపిల్స్ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆరోగ్యంగా ఉండటానికి యాపిల్ చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రతిరో
- By Nakshatra Published Date - 05:58 PM, Wed - 24 May 23
యాపిల్స్ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆరోగ్యంగా ఉండటానికి యాపిల్ చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రతిరోజు ఒక యాపిల్ తింటే ఆరోగ్యపరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించవచ్చు. యాపిల్ పండులో విటమిన్ ఏ, సి, క్యాల్షియం, పొటాషియం, పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. యాపిల్ లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. యాపిల్ పండ్లను ప్రతి రోజు తీసుకుంటుంటే క్యాన్సర్, మధుమేహం, గుండెకు సంబంధించిన జబ్బులు, అల్జీమర్స్లాంటి వ్యాధులు రావు.
యాపిల్ పండును తింటే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. యాపిల్ లో ఉండే బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎర్ర రక్త కణాలని నాడీ వ్యవస్థ మెరుగుదల కి దోహద పడుతుంది. అలాగే ఇందులో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం వంటి ఎన్నో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. ఇవీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రస్తుత రోజుల్లో యాపిల్స్ తినేవారిసంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన పనిలేదని అంటూ ఉంటారు. అలా అని యాపిల్స్ ని ఎక్కువగా తిన్న కూడా కూడా ప్రమాదమే. మరి యాపిల్స్ ఎక్కువగా తింటే ఏం జరుగుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
యాపిల్ తినడం వల్ల వచ్చే సమస్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. యాపిల్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. యాపిల్స్ అధిక మెుత్తంలో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. యాపిల్స్ లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
యాపిల్స్ రెండు కంటే ఎక్కువ తీసుకుంటే మీ దంతాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. యాపిల్స్ ఎక్కువ మెుత్తంలో తీసుకోవడం వల్ల మీ శరీరంలోని చక్కెర స్థాయిలు పడిపోతాయి.
Related News
Apple : ఐఫోన్ యూజర్లకు యాపిల్ సంస్థ వార్నింగ్..
Apple: యాపిల్ సంస్థ(Apple) తమ ఫోన్లు వాడుతున్న వారికి తాజాగా వార్నింగ్ ఇచ్చింది. ఇండియాతో పాటు మొత్తం 92 దేశాల్లో ఉన్న యూజర్లకు(users) ఆ హెచ్చరిక వెళ్లింది. మెర్సినరీ స్పైవేర్(Mercenary spyware)తో అటాక్ జరిగే ప్రమాదం ఉన్నట్లు ఆ వార్నింగ్ నోటిఫికేషన్లో యాపిల్ సంస్థ వెల్లడించింది. మీరు మెర్సినరీ స్పైవేర్ బాధితులు అయి ఉంటారని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నది. ఐఫోన్లను హ్యాక్ చేసే