Green Tea: గ్రీన్ టీ ఎప్పుడు తాగితే మంచిది? ఉదయమా లేక సాయంత్రమా?
గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదే కానీ, ఎప్పుడూ తాగితే మంచిది. ఏ సమయంలో తాగాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 04:00 PM, Tue - 4 March 25

ఇటీవల కాలంలో గ్రీన్ టీ తాగే వారి సంఖ్య చాలా వరకు పెరిగింది. టీ కాఫీలకు బదులు చాలామంది ఈ గ్రీన్ టీ తాగడానికి ఇష్టపడుతున్నారు. చాలామంది రోజుని వేడి వేడి కాఫీ లేదా గ్రీన్ టీ వంటి వాటితో స్టార్ట్ చేస్తూ ఉంటారు. గ్రీన్ టీ తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కాఫీ టీ తో పోల్చుకుంటే గ్రీన్ టీ చాలా మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా గ్రీన్ టీ మన బరువును తగ్గించడానికి చాలాబాగా సహాయపడుతుందట. అలాగే మెటబాలిజాన్ని పెంచడంతో పాటుగా ఎంతో మేలు చేస్తుందట. ఇంతకీ ఈ గ్రీన్ టీ తాగడానికి సరైన సమయం ఎప్పుడు? ఎప్పుడు తాగితే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చాలా మంది ఉదయాన్నే గ్రీన్ టీని తాగుతుంటారు. కానీ గ్రీన్ టీ తాగడానికి ఇది బెస్ట్ టైం కాదట. మీరు గ్రీన్ టీని తాగాలనుకుంటే బ్రేక్ ఫాస్ట్ తర్వాత గంట తర్వాత లేదా భోజనం చేసిన గంట తర్వాతనే తాగాలట. దీనివల్ల మీ శరీరంలో ఉన్న అదనపు కొవ్వు విచ్ఛిన్నం అవుతుందట. గ్రీన్ టీ మీ జీర్ణవ్యవస్థ మరింత మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుందట. పాలు, పంచదార కలిపిన టీ, కాఫీలల్లో లాగే గ్రీన్ టీలో కూడా కెఫిన్ కంటెంట్ ఉంటుంది. ఇది మీ శరీరాన్ని చురుగ్గా ఉంచుతుందట. వ్యాయామం, వాకింగ్ చేయడానికి అరగంట ముందు గ్రీన్ టీని తాగితే ప్రయోజనకరంగా ఉంటుందట.
ఇతర టీల మాదిరిగానే గ్రీన్ టీని కూడా నిద్రపోవడానికి ముందు అస్సలు తాగకూడదట. ముఖ్యంగా నిద్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు అసలు తాగకూడదని చెబుతున్నారు. గ్రీన్ టీలో కెఫిన్ ఉంటుంది. ఇది మీకు నిద్రపట్టకుండా చేస్తుందట. అంటే ఇది మెలటోనిన్ ను విడుదలను నిరోధిస్తుందట. పరిగడుపున గ్రీన్ టీని తాగకూడదు. చాలా మంది జీవక్రియ ప్రారంభమవుతుందని ఉదయాన్నే గ్రీన్ టీని తాగుతుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదట. ఎందుకంటే గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పాలీ ఫెనాల్స్ గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తిని పెంచుతాయట. దీంతో మీకు కడుపుకు సంబంధించిన సమస్యలు వస్తాయని చెబుతున్నారు. చాలా మంది ట్యాబ్లెట్లను గ్రీన్ టీతో పాటుగా వేసుకుంటారు. కానీ ఈ అలవాటు మీ ఆరోగ్యానికి మంచిది కాదట. ఎందుకంటే మాత్రలు వేసుకున్న వెంటనే లేదా దానితో పాటుగా తీసుకోవడం ప్రమాదకరం అని చెబుతున్నారు. మందుల్లో ఉండే రసాయనాలు గ్రీన్ టీ తో స్పందించి ఎసిడిటీని కలిగిస్తాయట. అందుకే మాత్రలను ఎప్పుడూ కూడా సాదా నీటితోనే వేసుకోవాలని చెబుతున్నారు.