HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Health Risks Of Beetroot Juice Who Should Avoid It

‎Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్ మంచిదే కానీ.. వీరికి మాత్రం విషంతో సమానం!

‎Beetroot Juice: బీట్రూట్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిదే అయినప్పటికీ కొంతమందికి మాత్రం ఇది విషంతో సమానమని అది పొరపాటున కూడా వాళ్ళు తాగకూడదని చెబుతున్నారు. ఇంతకీ బీట్రూట్ జ్యూస్ ఎవరు తాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 

  • Author : Anshu Date : 16-10-2025 - 5:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Beetroot Juice
Beetroot Juice

‎Beetroot Juice: మన వంటింట్లో దొరికే కూరగాయలలో బీట్ రూట్ కూడా ఒకటి. కాగా బీట్ రూట్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. బీట్ రూట్ ఉపయోగించి ఎన్నో రకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. అలాగే బీట్ రూట్ జ్యూస్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని తాగడం వల్ల వెయిట్ లాస్ నుంచి శరీరంలో రక్తం పెరగడం వరకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. కానీ కొంతమంది ఈ బీట్ రూట్ జ్యూస్ ను అస్సలు తాగకూడదట. ఎందుకంటే ఇది వీళ్లకు విషం లాగా పనిచేస్తుందని చెబుతున్నారు.
‎
‎ అలాగే బీట్ రూట్ జ్యూస్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీన్ని తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందట అలాగే బరువు తగ్గడానికి, శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి ఇలా ఎన్నో విధాలుగా బీట్ రూట్ జ్యూస్ సహాయపడుతుందని చెబుతున్నారు. అయితే ఇది అందరికి మంచిది కాదట. కొందరికి ఇది విషయంతో సమానం అని చెబుతున్నారు. అధిక రక్తపోటు ఉన్నవారికి బీట్ రూట్ జ్యూస్ చాలా మంచిదట. ఇది రక్తపోటును తగ్గించడానికి, నియంత్రించడానికి బాగా సహాయపడుతుందని, తక్కువ రక్తపోటు ఉన్నవారు దీన్ని తాగితే బీపీ మరింత తగ్గుతుందని అందుకే వీరు తాగకూడదని చెబుతున్నారు.
‎
‎అలాగే బీపీని కంట్రోల్ చేయడానికి మందులను ఉపయోగిస్తున్న వారు కూడా బీట్ రూట్ జ్యూస్ ను తాగకూడదట. ఎందుకంటే ఇది బీపీ మరింత తగ్గించి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందట. బీపీ తక్కువగా ఉన్నవారు, బీపీ మందులను వాడేవారు ఈ జ్యూస్ ను తాగితే తలతిరగడం, కళ్లు తిరగడం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కాగా కొంతమందికి బీట్ రూట్ కూడా పడకపోవచ్చు. అంటే దీనికి కూడా అలెర్జీ ఉండవచ్చు. ఇలాంటి వారు బీట్ రూట్ జ్యూస్ తాగితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాపు, దురద వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కాగా బీట్ రూట్ ఫైబర్ కు మంచి వనరు. కానీ ఇది తింటే కొంతమందికి జీర్ణ సమస్యలు వస్తాయి.
‎
‎ముఖ్యంగా ఇది పేగు సంబంధిత సమస్యలు ఉన్నవారిపై చెడు ప్రభావం చూపుతుందట. అందుకే ఇలాంటి వారు బీట్ రూట్ జ్యూస్ ను తాగే ముందు ఖచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాలని చెబుతున్నారు. బీట్ రూట్ జ్యూస్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది అని చెబుతున్నారు. అందుకే డాక్టర్ ను సంప్రదించకుండా డయాబెటీస్ ఉన్నవారు బీట్ రూట్ జ్యూస్ ను అస్సలు తాగకూడదని చెబుతున్నారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారు బీట్‌రూట్ జ్యూస్ అస్సలు తాగకూడదట. ఎందుకంటే ఇందులో ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయని,ఇవి కిడ్నీలో రాళ్లను ఏర్పరుస్తాయని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • beet root
  • beetroot juice
  • drinking Beetroot Juice
  • health tips

Related News

Tender tamarind leaves put a stop to those problems...!!

Tamarind leaves: చింత చిగురు ఆ సమస్యలకు చెక్ పెడుతుంది…!!

చింతచిగురు పప్పు, చింతచిగురు రొయ్యలు, చింతచిగురు మటన్… ఇవన్నీ ఫేమస్ వంటకాలు. వేసవిలో ఇవి విరివిగా లభిస్తాయి. పుల్లగా ఉండే చింతచిగురుతో చేసుకునే వంటకాలు భలే టెస్టీగా ఉంటాయి. అంతేకాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చింతచిగురులో ఉండే ఔషధ గుణాలు శరీరానికి మంచి ఎనర్జీని అందిస్తాయి. అవేంటో తెలుసుకుందాం. చింతచిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది జీర్ణ వ్యవ

    Latest News

    • Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం రెడ్డి పాడె మోసిన Ys జగన్

    • Amazon Data Centre: ఫ్యూచర్ సిటీకి అమెజాన్ డేటా సెంటర్: సీఎం రేవంత్

    • Regular Sugar vs. Monk Fruit: సాధారణ చక్కెర vs. మాంక్ ఫ్రూట్: రక్తంలో చక్కెర స్థాయికి ఏది మంచిది?

    • Liquor prices: మందుబాబులకు కిక్కు దిగే వార్త.. రాష్ట్రంలో పెరగనున్న మద్యం ధరలు

    • Nitin Gadkari: ఈ E20 ఇథనాల్ విధానాన్ని సమర్థించిన గడ్కరీ.. వినియోగదారులు అధిక ధరకు స్వచ్ఛమైన పెట్రోల్‌ను ఎంచుకోవచ్చని అన్నారు..

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd