Black Garlic: నల్ల వెల్లుల్లి గురించి మీకు తెలుసా.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో?
సాధారణంగా మనం తెలుపు రంగు వెల్లుల్లిని చూసి ఉంటాము. వీటిని వంటలతో పాటు అనేక రకాల ఆయుర్వేద
- By Anshu Published Date - 07:30 AM, Sun - 13 November 22

సాధారణంగా మనం తెలుపు రంగు వెల్లుల్లిని చూసి ఉంటాము. వీటిని వంటలతో పాటు అనేక రకాల ఆయుర్వేద మెడిసిన్లలో కూడా వీటిని ఉపయోగిస్తారు. ఈ వెల్లుల్లి అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది అన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. ఈ వెల్లుల్లిని తెల్లగడ్డ, ఎల్లిగడ్డ, ఎల్లి పాయ ఇలా ఒక్కో ప్రదేశంలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు. అయితే ఈ వెల్లుల్లికి ఆయుర్వేదంలో కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనిని ఎప్పటినుంచో శాస్త్రవేత్తలు ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూనే ఉన్నారు. ఈ వెల్లుల్లి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. ఈ వెల్లుల్లి వల్ల గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా బయట పడవచ్చు.
వెల్లుల్లి యాంటీ బయోటిక్ గా కూడా పనిచేస్తుంది. వెల్లుల్లిని మధుమేహం ఉన్న. వారు తినడం వల్ల అది చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది. వెల్లుల్లి చర్మ పునరుత్పత్తిని బాగా పెంచుతుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చి, మొటిమలు, సోరియాసిస్, తామర లాంటివి రాకుండా నిరోధిస్తుంది. కేవలం తెల్లవెల్లుల్లి మాత్రమే కాకుండా నల్ల వెల్లుల్లి కూడా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. నల్ల వెల్లుల్లి ఏంటా అని అనుకుంటున్నారా. మార్కెట్లో తెల్ల వెల్లుల్లి పాటు కూడా ఉంటుంది. ఈ నల్ల వెల్లుల్లి అన్నది చాలామందికి తెలియదు చాలామంది ఈ నల్ల వెల్లుల్లి ని చూసి కూడా ఉండరు.
ఈ నల్ల వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలను కలిగిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ వెల్లుల్లిలో గుండె ఆరోగ్యానికి సంబంధించిన అలిసిన్ అనే సమ్మేళనం ఉన్నప్పటికీ, నలుపు రంగులో ఉండే పదార్ధం తేలికపాటి రుచిని కలిగి ఉంటుంది.ఈ వెల్లుల్లిని చాలా మంది ఇష్టపడి తింటూ ఉంటారు. సలాడ్ డ్రెస్సింగ్ లకు రిచ్‌నెస్ జోడించడానికి, కాల్చిన వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేయండి, ఆలివ్ నూనెతో స్ప్రే చేయండి, ఉప్పుతో సీజన్ చేయండి ,క్రస్టీ బ్రెడ్‌పై స్ప్రెడ్ చేస్తే చాలు.