White Chocolates: రోజు ఒక ముక్క వైట్ చాక్లెట్ తింటే ఏం జరుగుతుందో తెలుసా?
చాక్లెట్.. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. చాక్లెట్లలో అనేక రకాల ఫ్లేవర్స్
- By Anshu Published Date - 05:27 PM, Sun - 9 April 23

చాక్లెట్.. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. చాక్లెట్లలో అనేక రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. వైద్యులు కూడా డార్క్ చాక్లెట్లను తినమని చెబుతూ ఉంటారు. డార్క్ చాక్లెట్లు తినడం వల్ల మానసిక సమస్యలు తగ్గుతాయి. కేవలం డార్క్ చాక్లెట్లు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు వైట్ చాక్లెట్లు కూడా తింటూ ఉండాలి. మరి వైట్ చాక్లెట్ తినడం వల్ల ఏం జరుగుతుందో? ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వైట్ చాక్లెట్స్ లో కాల్షియం అధికంగా ఉంటుంది.
వైట్ చాక్లెట్ వల్ల ఎముకలు, దంతాలు బలంగా మారుతాయి. నరాలు, గుండె, కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. నోటి ఆరోగ్యానికి ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వారానికోసారైనా వైట్ చాక్లెట్ తినాలి. వైట్ చాక్లెట్లో వాడే కోకో బటర్లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. వీటికి యాంటీ ఆక్సిడెంట్ల గుణం ఎక్కువ. ఇవి తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధికరక్తపోటు రాకుండా అడ్డుకుంటుంది. వైట్ చాక్లెట్లను కోకో బటర్‌తోనే తయారు చేస్తారు. కాబట్టి ఇవి శరీరంలో ఇన్ ఫ్లమేషన్ రాకుండా అడ్డుకుంటాయి. అలాగే వైట్ చాక్లెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
మెదడుకు సంబంధించి చాలా రుగ్మతలతో పోరాడే ఫ్లేవనాయిడ్స్ వీటిలో పుష్కలంగా లభిస్తాయి. మతిమరుపు రాకుండా ఇవి కాపాడుతాయి. వైట్ చాక్లెట్ తినడం వల్ల స్వల్పకాలిక, దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి నయం అవుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది వైట్ చాక్లెట్. అవాంఛిత కొవ్వు చేరడం వల్ల గుండె సంబంధిత సమస్యలు పెరుగుతాయి. అవి రాకుండా గుండెను కాపాడుతుంది వైట్ చాక్లెట్. ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. దీనివల్ల గుండెపోటు రాదు. ఆహారంలోని విటమిన్లను గ్రహించేలా చేస్తుంది. మహిళలు అప్పుడప్పుడు వైట్ చాక్లెట్ తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది. దీనిలో పాలీ ఫెనాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యలు తగ్గిస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను అణిచివేస్తుంది. అధిక రక్తపోటు ఉన్న వారు రోజుకో చిన్నముక్క వైట్ చాక్లెట్ తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.