Rose Tea: గులాబీ టీ వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే?
మామూలుగా గులాబీ పూలను దేవుడి కోసం అలాగే స్త్రీలు తలలో పెట్టుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. గులాబీ పువ్వులను ఇష్టపడని స్త్రీలు ఉండరు అ
- By Anshu Published Date - 08:00 PM, Mon - 4 March 24

మామూలుగా గులాబీ పూలను దేవుడి కోసం అలాగే స్త్రీలు తలలో పెట్టుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. గులాబీ పువ్వులను ఇష్టపడని స్త్రీలు ఉండరు అనడంలో ఎటువంటి సందేహం లేదు. గులాబీ పువ్వు గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. వాటి అందానికి సువాసనకి దాసోహం కాని వారు ఎవరు ఉండరు. కేవలం ఆధ్యాత్మిక పరంగా, అందానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా గులాబీ పువ్వు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గులాబీ టీ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. మరి గులాబీటీ వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ గులాబీ పువ్వులు ఎన్నో ఔషధాలు దాగి ఉన్నాయి. ఈ గులాబీ పువ్వుల రెక్కలతో టీ చేసుకుని తాగడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ గులాబీ రెక్కలతో టీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒక పాత్రలో కొంత నీటిని తీసుకొని దాన్లో కొన్ని గులాబీ రెక్కలను వెయ్యాలి. తర్వాత కొద్దిసేపు వరకు వాటిని మరిగించాలి.20 నిమిషాల పాటు స్టవ్ సిం లో పెట్టుకొని మరిగించుకోవాలి. తర్వాత ద్రవాన్ని వడకట్టుకొని దానిలో కొంచెం తేనె కొంచెం నిమ్మరసం వేసి బాగా కలపాలి. దీంతో గులాబీటీ తయారవుతుంది. ఈ టీ తాగడం వలన మొహం పై ఉన్న మొటిమలు మచ్చలు మృతకనాలు తొలగిపోతాయి. చర్మం లో ఉన్న వ్యర్ధాలన్నీ తొలగిపోతాయి.
చర్మం మృదువుగా తయారవుతుంది. ఈ గులాబీ టీలో సాహజ సిద్ధమైన యాంటీబయాటిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తాయి. మహిళలు గులాబీ టీ తాగడం వలన నెలసరి సమస్యలు తొలగిపోతాయి. అలాగే గొంతు నొప్పి, జలుబు, జ్వరం ఇలాంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్ధకం, డయేరియా లాంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒత్తిడి ఆందోళన దూరమవుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ గులాబీ టీ రోజు తాగితే అధిక బరువు కూడా తగ్గుతారు. అలాగే మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు ఈటీవీ నిత్యం రెండుసార్లు తాగడం వలన ఆ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.