Mango Flower: వామ్మో.. మామిడి పూత వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలా?
కేవలం మామిడిపండు, మామిడి ఆకు వల్ల మాత్రమే కాకుండా మామిడి పూత వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. మరి మామిడి పూత వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 05:00 PM, Fri - 28 March 25

మామిడి చెట్టులోని ప్రతి ఒక్క భాగం ఉపయోగపడేదే అన్న విషయం మనందరికీ తెలిసిందే. వేర్లు మొదలుకొని పూత వరకు ప్రతి ఒక్కటి మనకు ఎంతో బాగా ఉపయోగపడతాయి. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మామిడి పూత వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయట. మామిడి పూతలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందట. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా కాపాడుతుందని చెబుతున్నారు. దీంతో డయాబెటిస్ నిప్పు రాకుండా కాపాడుకోవచ్చట. కాగా మామిడి పువ్వులలో యాంటీ ఇంప్లిమెంటరీ ఇలాంటి మైక్రోబియన్ గుణాలు ఉంటాయిట. ఇవి మొటిమలను తగ్గించడంతోపాటు చర్మ సమస్యలు రాకుండా కాపాడతారట. అలాగే చర్మ సౌందర్యాన్ని పెంచుతాయని చెబుతున్నారు.
మామిడి పూతలో పుష్కలమైన పోషకాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇవి అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతాయట. అలాగే జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయట. మామిడి పూలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయట. ఇవి మంట, వాపు వంటి సమస్యలు తగ్గిస్తాయట. కీళ్లను ఆరోగ్యంగా ఉంచి ఆర్థరైటిస్ రాకుండా కాపాడుతాయని చెబుతున్నారు. అదేవిధంగా మామిడి పూలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయట. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయని, తద్వారా అనేక రకాల ఇన్పెక్షన్లు రాకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు. మామిడి పూలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు ఉంటాయట.
ఇవి శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేలా చూస్తాయట. దీంతో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని చెబుతున్నారు. హృదయ సంబంధ సమస్యలు రాకుండా కూడా ఉంటాయట. మామిడి పూత దగ్గు తగ్గించడంలోనూ ఉపయోగిస్తారట. ఇది దగ్గు, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాస సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతుందట. అలాగే ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతున్నారు. అలాగే మామిడి పూలలో ఫైబర్ ఉంటుందట. దీనిని తినడం వల్ల బరువు అదుపులో ఉంచుకోవచ్చట. బరువు తగ్గాలని చూసేవారు ఈ పువ్వు తినడం మంచిదని చెబుతున్నారు..