Makhana Benefits: త్వరగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ గింజలు తినాల్సిందే?
ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ అధిక బరువు సమస్య కారణంగా చాలామంది వారి పని వారి చేసుకోలేక తీవ్ర ఇబ్బంద
- By Anshu Published Date - 09:05 PM, Tue - 4 July 23

ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ అధిక బరువు సమస్య కారణంగా చాలామంది వారి పని వారి చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. అధిక బరువు సమస్యను తగ్గించుకోవడానికి ఎన్నో రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. జిమ్ లో వర్క్ ఔట్స్ చేయడంతో పాటు యోగాలు అలాగే రకరకాల హోమ్ రెమెడీస్ ని ఫాలో అవుతూ ఉంటారు. అయినప్పటికీ చాలామందికి సరైన ఫలితం కనిపించక దిగులు పడుతూ ఉంటారు. అయితే అధిక బరువు సమస్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈ గింజలు తినడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.
మరి అధిక బరువు సమస్యను తగ్గించుకోవడం కోసం ఎటువంటి గింజలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తామర గింజల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఈ గింజల్లో పుష్కలంగా ఉంటాయి. మఖానా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని న్యూట్రిషనిస్టులు చెబుతుంటారు. తామర గింజల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగో కేలరీలు చాలా చాల తక్కువ మొత్తంలో ఉంటాయి. దాంతో పాటు పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి ఫాక్స్ నట్స్ తినాలని న్యూట్రిషనిస్టులు, జిమ్ ట్రైనర్‌లు సూచిస్తుంటారు. తామర గింజలు తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. త్వరగా ఆకలి వేయదు. అందుకే తక్కువ మొత్తంలో తింటారు. అలా లోటస్ సీడ్స్ బరువు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి.
అలాగే తామర గింజల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి మఖానాలో అనేక పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ తో పాటు అనేక సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు తామర గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో, ఆక్సీకరణ ఒత్తిడిని నిరోధించడంలో సహాయపడతాయి. మఖానాలో గల్లిక్ యాసిడ్, క్లోరోజెనిక్ యాసిడ్, ఎఫికాటెచిన్ వంటి నిర్దిష్ట యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. గుండె జబ్బులు, క్యాన్సర్, టైప్-2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక పరిస్థితుల నుండి రక్షిస్తాయి. కాల్షియం ఎముకలల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అలాగే రక్తపోటును తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతుంది. మెగ్నీషియం శరీరంలో విస్తృతమైన జీవక్రియ ప్రతిచర్యలకు అవసరం. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి ఫాక్స్ నట్స్ మెరుగైన బ్లడ్ షుగర్ నిర్వహణకు తోడ్పడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎంజైమ్ లను పెంచుతాయి. మఖానా విత్తనాల్లోని పోషకాలు ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరుస్తుందని అధ్యయనాల్లో తేలింది.