Regi Fruits: చలికాలంలో దొరికే రేగి పండ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
రేగి పండ్ల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 10:32 AM, Sat - 14 December 24

రేగి పండ్లు.. వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు. ఈ రేగి పండ్లు ఎక్కువగా చలికాలంలో లభిస్తూ ఉంటాయి. కానీ ఈ రేగి పండ్లు తింటే దగ్గు జలుబు వంటివి వస్తాయని చాలామంది వీటిని తినడానికి ఇష్టపడరు. కానీ రేగిపల్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం వాటినీ తినకుండా అసలు ఉండలేరు. మరి రేగి పండ్ల వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రేగిపండ్లని జుజుబి ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. ఈ పండ్లలో ఫైబర్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల నిద్ర సమస్యలు దూరమవ్వడం దగ్గర నుంచి బాడీలోని టాక్సిన్స్ ఫ్లష్ అవుతాయి. ఇంకా ఈ రేగిపల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే..
రేగి పండ్లలో కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఎముకల్లో బలాన్ని పెంచి మజిల్స్‌ని ఇంప్రూవ్ చేస్తాయట. ఈ పండ్లు తినడం వల్ల నాడీవ్యవస్థ ఆరోగ్యంగా మారుతుందట. అలాగే ఈ రేగిపండ్లు తినడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవల్స్ ఇంప్రూవ్ అవుతాయట. షుగర్ ఉన్నవారు కూడా హ్యాపీగా తినవచ్చట. అలా అని మరీ ఎక్కువగా తినడం అంత మంచిది కాదు. వీటిని తిన్నా కూడా కేవలం మోతాదులో మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు. సీజనల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. అయితే రేగిపండ్లు తింటే జలుబు చేస్తుందని.. కానీ, వీటిని తినడం వల్ల జలబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ సమస్యలు దూరమవుతాయట.
అలాగే రేగి పండ్లలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల బాడీలోని ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. దీంతో బాడీలో మంట, బాడీ పెయిన్స్ దూరమవుతాయట. చలికాలంలో తింటే మరింత ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయనీ చెబుతున్నారు. అలాగే రేగిపండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండెకి చాలా మేలు చేస్తుంది. కాబట్టి, ఈ పండ్లని రెగ్యులర్‌గా తినవచ్చు. వీటితో పాటు ఈ పండ్లు తింటే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందని చెబుతున్నారు. అదేవిధంగా రేగి పండ్ల వల్ల జీర్ణ సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయట. ఆ సమస్యలు ఉన్నవారు తరచుగా రేగిపండ్లని తినడం మంచిదని చెబుతున్నారు. రేగి పండ్లలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ అంటే విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, పాలీశాచురైడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయట. అంతే కాకుండా వీటిని తినడం వల్ల ప్రమాదకర గుండె సమస్యల లాంటి డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా దూరమవుతాయి. కాగా గర్భిణీలు ఈ రేగి పండ్లు తినే విషయంలో డాక్టర్‌ని సంప్రదించాలట. వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే గర్భిణీ స్త్రీలు ఈ రేగి పండ్లను తినడం మంచిదని చెబుతున్నారు.