Jaggery Water: ప్రతీ రోజూ రాత్రి బెల్లం నీరు తాగితే ఏం జరుగుతుందో, ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?
బెల్లం నీరు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి అని, ఈ నీరు తాగడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్య పోవడం ఖాయం అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 09:02 AM, Mon - 31 March 25

బెల్లం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బెల్లం తరచుగా తినడం వల్ల అనేక రకాల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. బెల్లం టీ వంటి పానీయాలతో పాటుగా అనేక రకాల స్వీట్లు తయారీలో ఉపయోగిస్తారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే కేవలం బెల్లం వల్ల మాత్రమే కాకుండా బెల్లం నీరు వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
మరి బెల్లం నీరు తాగితే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ బెల్లం నీటికి బెల్లం, మంచి నీటితో పాటు ఒక యాలకలు కూడా వాడాలి. ఒక గ్లాసు నీటిని తీసుకొని వేడి చేయాలి. ఆ వేడి చేసిన నీటిలో వెల్లం, ఒక యాలక్కాయ వేసి కాసేపు అలానే ఉంచాలి. తర్వాత ఆ నీటిని వడబోసి రాత్రిపూట తాగాలి. కావాలంటే పసుపు కూడా కలుపుకోవచ్చట. ఈ వాటర్ రోజూ రాత్రిపూట తాగడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుందట.
ఈ పానీయం చేతులు ,పాదాల నొప్పులు, వాపులు, కీళ్ల నొప్పులు, పాదాల నొప్పి , చికాకు, అలసట, జ్ఞాపకశక్తి కోల్పోవడం, అజీర్ణం, మలబద్ధకం, అపానవాయువు, రక్తహీనత, చర్మ సమస్యలు, అలర్జీ, ఉబ్బసం వంటి వివిధ వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుందని, ఈ ప్రత్యేక పానీయాన్ని రాత్రి నిద్రపోయే ముందు గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగాలని చెబుతున్నారు. కాగా బెల్లంలో ఐరన్, కాల్షియం, పొటాషియం, సోడియం, చక్కెర ,విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయట. అలాగే వాతావరణ మార్పుల వల్ల కొందరికి ఆస్తమా, జలుబు, దగ్గు వంటివి వస్తాయి. ఈ మధ్యకాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే..ఈ డ్రింక్ తాగినా లేదంటే. నిద్రలేమి సమస్య నిద్రలేమితో బాధపడేవారు పాలలో బెల్లం కలిపి తాగితే మంచి నిద్ర వస్తుందట. అంతే కాకుండా వాత, పిత్త, రక్తహీనతలను బెల్లం నయం చేస్తుందని చెబుతున్నారు. ఋతుస్రావం సమయంలో శారీరక అలసట నుండి ఉపశమనం పొందడానికి మహిళలు దీనిని తీసుకోవచ్చని చెబుతున్నారు.