Pistachio: గుప్పెడు పిస్తాలతో అలాంటి సమస్యలన్నీ మాయం.. అందుకోసం ఏం చేయాలో తెలుసా?
ప్రతిరోజు గుప్పెడు పిస్తాలను తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల భారీ నుంచి బయటపడవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 02:00 PM, Wed - 18 December 24

డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన పిస్తా పప్పు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పిస్తా పప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిని తరచుగా తినడం వల్ల ఎన్నో రకాల రోగాల సమస్యల నుంచి బయటపడవచ్చు. వీటిలో ఫైబర్ ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. అలాగే ఈ పిస్తాపప్పులో కాల్షియం, ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు విటమిన్ ఎ, బి6, కె, సి, ఇ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. రోజూ గుప్పెడు పిస్తా పప్పులను తీసుకుంటే ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందట.
ఎన్నో రోగాల ముప్పు కూడా తప్పుతుందంటున్నారు. అయితే రోజు గుప్పెడు పిస్తాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పిస్తాపప్పుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ గింజలను తింటే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గుతుంది. పిస్తాపప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటుగా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుందట. ఈ అధిక రక్తపోటు గుండెపోటుకు దారితీస్తుందని చెబుతున్నారు.
అదేవిధంగా పిస్తాలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ గట్ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. మంచి జీర్ణక్రియ కోసం పిస్తాపప్పును కూడా క్రమం తప్పకుండా తినవచ్చట. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా పిస్తాపప్పులు సహాయపడతాయి. పిస్తా పప్పులో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు పిస్తాపప్పును తమ ఆహారంలో చేర్చవచ్చని చెబుతున్నారు. కాగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పిస్తాపప్పును తీసుకోవడం వల్ల ఆకలి కూడా తగ్గుతుందట. ఇది మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుందని దీంతో మీరు అతిగా తినలేరు. దీనివల్ల మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారని చెబుతున్నారు. కంటి ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి కూడా పిస్తాపప్పు ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. పిస్తాపప్పులో ఉండే విటమిన్ బి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను నియంత్రించడానికి, మెరుగుపర్చడానికి సహాయపడుతుందట. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ పుష్కలంగా ఉండే పిస్తాపప్పు మన చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయట. మనకు నిద్రపోవడానికి సహాయపడే మెలటోనిన్ ఎక్కువగా ఉండే గింజల్లో పిస్తా ఒకటి. రాత్రి భోజనం చేసిన తర్వాత కొన్ని పిస్తా పప్పులను తినడం వల్ల మంచిగా నిద్రపడుతుందట.