Jaggery: భోజనం తర్వాత బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే ఏం జరుగుతుందో.. ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?
Jaggery: భోజనం చేసిన తర్వాత బెల్లం తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:30 AM, Mon - 13 October 25

Jaggery: భోజనం చేసిన తర్వాత బెల్లం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. ఇది ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుందట. బెల్లం జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుందట. ఎంజైమ్ లు యాక్టివేట్ అయి ఆహారం త్వరగా జీర్ణమవుతుందట. అలాగే బెల్లం జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. ఇది ఎంజైమ్ లు యాక్టివేట్ అయి ఆహారం త్వరగా జీర్ణమవుతుందట.
ఆహారం తిన్న తర్వాత అజీర్ణం, గ్యాస్ సమస్య ఉన్నవారు బెల్లం తింటే మంచిదట. భోజనం తర్వాత బెల్లం తినడం వల్ల స్వీట్ క్రేవింగ్స్ తగ్గుతాయని, అలసట కూడా తగ్గిస్తుంది. బెల్లంతో కాలేయం శుభ్రం అవుతుందట. ఇది శరీరంలోని టాక్సిన్ లను తొలగించడంలో హెల్ప్ చేస్తుందట. బెల్లంలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత నుంచి రక్షిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుందట. భోజనం చేసిన వెంటనే 5 నుంచి 10 గ్రాముల బెల్లం తినడం మంచిది. ఎక్కువ తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగవచ్చని చెబుతున్నారు.
బెల్లం బీపిని కంట్రోల్ చేస్తుందట. అలాగే శరీరంలో యాసిడ్ స్థాయిని కంట్రోల్ చేస్తుందని చెబుతున్నారు. ఇందులోని పొటాషియం, సోడియం ఈ బెనిఫిట్స్‌ని అందిస్తాయట. బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బాడీని డీటాక్సీఫై చేస్తాయట. లివర్ కి కూడా మంచిది. రోజూ బెల్లం తీసుకుంటే ట్యాక్సిన్స్ దూరమై క్యాన్సర్ సహా ఇతర సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు. చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బెల్లం నేచురల్ బాడీ క్లెన్సర్ లా పనిచేస్తుందట. ఇందులోని మాంగనీస్, సెలీనియం వ్యర్థాలను బయటకి పంపుతాయని, ఇవి రక్తశుద్ధి, వాత, పిత్త సమస్యల్ని దూరం చేస్తాయని చెబుతున్నారు. వీటితో పాటు బెల్లంలో కాల్షియం, ఫాస్పరస్, జింక్‌లు ఉన్నాయని చెబుతున్నారు.