Cabbage: తరచుగా క్యాబేజీ తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
Cabbage: తరచుగా క్యాబేజీ తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:30 AM, Thu - 27 November 25
Cabbage: మన వంటింట్లో ఉండే కూరగాయలలో క్యాబేజీ కూడా ఒకటి. క్యాబేజీ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్యాబేజీని ఉపయోగించి ఎన్నో రకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. కాగా క్యాబేజీలో ఫైబర్, నీటి శాతం, గట్ లో ప్రయోజనకరమైన బాక్టీరియాను పెంచడానికి కూడా సహాయపడుతుందట. చెడు బాక్టీరియా పెరుగుదలను కూడా నియంత్రిస్తుందని చెబుతున్నారు.
మనం ప్రతిరోజూ వంట కోసం ఉపయోగించే ప్రతి కూరగాయలో వివిధ రకాల పోషకాలు ఉంటాయట. వీటిని సరైన మొత్తంలో తీసుకుంటే, శరీరంలోని అనేక అవయవాలు సజావుగా పని చేయడం మాత్రమే కాకుండా, చాలా రకాల వ్యాధులు దరిచేరకుండా జీవించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. క్యాబేజీలో ఫైబర్, నీటి శాతం, గట్ లో ప్రయోజనకరమైన బాక్టీరియా ను పెంచడానికి కూడా సహాయపడుతుందట. చెడు బాక్టీరియా పెరుగుదలను కూడా నియంత్రిస్తుందని, ఈ రోజుల్లో, మనం ఏ ఆహారం తిన్నా, కొన్నిసార్లు కడుపు చికాకు, ఆమ్లత్వం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
అంతేకాకుండా, మనం తినే ఆహారం కూడా జీర్ణం కావడానికి చాలా గంటలు పడుతుంది. మీరు దీన్ని సరిచేయాలనుకుంటే, మీరు క్యాబేజీని మెత్తగా రుబ్బుకుని ప్రతిరోజూ ఉదయం రసంగా చేసి త్రాగవచ్చట. పచ్చిగా తినడం మీకు ఇష్టం లేకపోయినా, క్యాబేజీ , క్యారెట్లతో సూప్ తయారు చేసుకోవచ్చట. పనికి వెళ్ళే తొందరలో ఉదయం తినలేకపోయినా, రాత్రిపూట తినవచ్చట. ఇందులోని విటమిన్ కె, ఎ గ్లుటామైన్ వంటి వివిధ పోషకాలు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని, ఇది పెద్దప్రేగు శోథ, గ్యాస్ట్రిటిస్ వంటి వ్యాధుల నుండి కూడా రక్షిస్తుందని, దీనితో పాటు, క్యాబేజీ రసం ఎసిడిటీ కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. క్యాబేజీలోని విటమిన్ ఎ , సల్ఫర్ అధికంగా ఉండే పోషకాలు జుట్టు సమస్యలను పరిష్కరించడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయని చెబుతున్నారు. విటమిన్ సి లక్షణాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయట. క్యాబేజీ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందట. గుండె సజావుగా పనిచేయడంలో సహాయపడుతుందట. క్యాబేజీ ఆరోగ్యానికి మంచిది అయినప్పటికీ థైరాయిడ్ సమస్య ఉన్నవారు, జీర్ణ సమస్యలు ఉన్నవారు అసలు తినకూడదని చెబుతున్నారు.