Coconut Water: ప్రతిరోజు కొబ్బరిబోండం తాగవచ్చా.. తాగితే ఏమవుతుందో మీకు తెలుసా?
అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలిగిన కొబ్బరి బోండంను ప్రతిరోజు తాగవచ్చా తాగితే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 01:06 PM, Mon - 20 January 25

వేసవికాలంలో అలాగే హెల్త్ బాగోలేనప్పుడు నీరసంగా అనిపించినప్పుడు డిహైడ్రేట్ అయినప్పుడు చాలామంది కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటారు. సందర్భాలలో కొబ్బరినీళ్లు ఎంతో మేలు చేస్తాయి. అందుకే వైద్యులు కూడా సీజన్ తో సంబంధం లేకుండా తరచుగా కొబ్బరి నీటిని డైట్ లో చేర్చుకోమని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో కొబ్బరి నీటిని ఎక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. అయితే ఎన్నో ప్రయోజనాలు కలిగిన కొబ్బరి నీటిని ప్రతి రోజు తాగితే ఏం జరుగుతుంది? అసలు కొబ్బరినీరు ప్రతిరోజు తాగవచ్చా? ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వైద్యులు కొబ్బరి నీటిని హాస్పటల్లో పేషంట్లకు ఇచ్చే సైలైన్ బాటిల్ తో సమానం అని అంటున్నారు. కొబ్బరినీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగించడంతోపాటు ఇన్స్‌టాంట్ ఎనర్జీని ఇస్తాయట. రెండు వారాల పాటు ప్రతి రోజు ఒక కొబ్బరి గ్లాసు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చట. అప్పుడే శరీరంలో కనిపించే మార్పులను గమనించవచ్చు అని చెబుతున్నారు. ఈ కొబ్బరి నీళ్లల్లో పొటాషియం పుష్కలంగా వుంటుంది. శరీరంలో వుండే బ్లడ్ ప్రెజర్ ను, గుండె పని తీరులు, జీర్ణ క్రియను మెరుగుపరచడంలో ఈ పోషకం కీలకంగా వ్యవహరిస్తుంది. అయితే ఈ పొటాషియం శరీరంలో సహజంగా ఉత్పత్తి కాదు. దీనిని ఆహారం ద్వారా మాత్రమే తీసుకోవాలి.
కాబట్టి కొబ్బరి నీళ్లను తాగమని ప్రోత్సహిస్తున్నారు. కూల్ డ్రింకులు, స్పోర్ట్స్ డ్రింకులకు ప్రత్యామ్నాయంగా ఈ కొబ్బరి నీళ్లను తాగవచ్చు. బయట మార్కెట్లో లభించే చాలా పానియాల్లో కెమికల్స్ వుంటాయి. ఈ కొబ్బరి నీళ్లల్లో అంతా సహజమైనవే వుండడం వల్ల శరీరానికి చాలా మంచిది. స్పోర్ట్స్ డ్రింకుల్లో చక్కర శాతం కూడా అధికంగా వుంటుంది. చాలా మంది క్రీడాకారులు గ్రౌండ్ పైకి వెళ్లినప్పుడు కొబ్బరి నీళ్లను బాటిల్ లో పోసుకొని వెళ్తారు. ఇది ఇన్స్‌టాంట్ ఎనర్జీని ఇస్తుంది. కొబ్బరి నీళ్లు ఎటక్ట్రోలైట్ గా పనిచేసి నీటి శాతాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. కొబ్బరి నీలల్లో ఎలక్టోరైట్లు చాలా పుష్కలంగా వుంటాయ్. శరీరంలో ఏడు ఎలక్టోరైట్లు ఉంటాయి. వాటిలో 5 కొబ్బరి నీలల్లో వుంటాయి. దీని వల్ల నడుము నొప్పి, కండరాల నొప్పి, యముకల నొప్పి దూరమవుతాయట.
కిడ్నీలు పనితీరు బాగుంటాలంటే యూరిన్ ఉత్పత్తి కావాలి. యూరిన్ ను ఉత్పత్తి చేయడంలో కూడా కొబ్బరి నీళ్లు దోహదపడతాయట. యూరిన్ శరీరం లోంచి వెళ్లినప్పుడు శరీరంలో ఉండే చెడు పదార్ధాలు బయటకు వెళ్లడానికి ఆస్కారం ఉంటుందట. యూరిన్ వెళ్లకపోతే శరీరంలో టాక్సిక్ గా మారుతుందట. కిడ్నీలు శుద్ధి కాకుండా అలానే ఉంటాయట. కాబట్టి కిడ్నీ పనితీరు బాగుండాలంటే కొబ్బరి నీరును తప్పకుండా తాగాలని, అయితే రాత్రి సమయంలో మాత్రం కొబ్బరి నీళ్లను తాగకూడదని, కొబ్బరి నీళ్లు గుండెను ఆరోగ్యంగా వుంచుతుందని చెబుతున్నారు.