Beet Root: వామ్మో.. బీట్‌రూట్ జ్యూస్ తాగితే అన్ని రకాల ప్రయోజనాలా!
బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. ఆ ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
- By Anshu Published Date - 03:34 PM, Mon - 3 February 25

మన వంటింట్లో దొరికితే కాయగూరలలో బీట్‌రూట్ కూడా ఒకటి. ఇది దుంప జాతికి చెందినది అన్న విషయం తెలిసిందే. దీనిని కూరల రూపంలో లేదంటే నేరుగా కూడా తీసుకోవచ్చు. బీట్రూట్ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. తప్పకుండా తరచుగా బీట్‌రూట్ ను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. బీట్రూట్ రసం కూడా ఎంతో మేలు చేస్తుంది. మరి బీట్‌రూట్ రసాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ జ్యూస్ లో ఉండే ఫొలేట్, బి విటమిన్ గర్భిణులకు కడుపులో బిడ్డ ఎదుగుదలకు చాలా బాగా దోహదపడుతుంది.
ఈ ఫొలేట్ బీట్‌రూట్ జ్యూస్ లో అధికంగా ఉంటుంది. ప్రతీ రోజు గర్భిణులు క్రమం తప్పకుండా బీట్‌రూట్ తీసుకోవాలి వైద్య నిపుణులు చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ తగ్గుదల శరీరంలో గనుక కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే అంటే కొవ్వు ఎక్కువగా ఉండే బీట్‌రూట్ లో ఉండే బెటానిన్ ఆ కొవ్వును తగ్గిస్తుంది. బరువు ఎక్కువగా ఉన్నవారు బీట్‌రూట్ జ్యూస్ తాగితే తగ్గే అవకాశం ఉంది. రక్తపోటు తగ్గింపు బీట్‌రూట్ లో రక్తపోటును తగ్గించే నైట్రేట్ పోషకం ఉంటుంది. హైపర్ టెన్షన్ తో సతమతమయ్యేవారికి ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుందట. స్టామినా, బలాన్ని కూడా పెంచే శక్తి బీట్‌రూట్ జ్యూస్ కు ఉందట. అయితే ఒక వారం పాటు ప్రతీ రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగితే అద్భుత ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. క్యాన్స్‌ర్ నివారణ బీట్‌రూట్ లో బెటాలైన్లతో పాటు మరికొన్ని యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. క్యాన్సర్ కు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ ను, హానికర బ్యాక్టీరియాలను ఈ బెటలైన్లు నాశనం చేస్తాయి. దీంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం నుంచి బయట పడతారు.
పొటాషియం, నరాలు, కండారాలల్లో బలం బీట్ రూట్ జ్యూస్ లో పొటాషియం పోషకాలు సంమృద్ధిగా ఉంటాయ్. నరాలు, కండరాలు బలంగా ఉండాలంటే శరీరంలో పొటాషియం ఉండాలి. లేదంటే కళ్లు తిరగడం, అలసట, తిమ్మిర్లు, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయట. కాబట్టి పొటాషియం కోసం బీట్ రూట్ జ్యూస్ తాగాల్సిందే అంటున్నారు. అయితే ఎన్నో పోషకాలు తియ్యగా ఉండే బీట్‌రూట్ లో ఫొలేట్, బేటలైన్లు, పొటాషియంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, సోడియం, జింక్, కాపర్, సెలీనియం వంటి పోషకాలతో పాటు జీర్ణ ప్రక్రియకు దోహదపడే ఫైబర్ కూడా ఉంటుంది. ఫ్యాటీ లివర్ లివర్‌పై కొవ్వు పేరుకుపోకుండా బీట్‌రూట్ లో ఉండే బెటనైన్ కాపాడుతుందట. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే కూడా బీట్‌రూట్ జ్యూస్ తాగాల్సిందే అంటున్నారు. అయితే బీట్‌రూట్ జ్యూస్ తాగిన రెండు గంటల్లోనే శరీరం యాక్టివ్ అవుతుందట. బ్లడ్ ప్రెజర్ ఎక్కువగా ఉంటే తగ్గించి ఆందోళనలను దూరం చేస్తుందని చెబుతున్నారు.