Basil Water: ఏంటి! తులసి నీరు తాగితే ఏకంగా అన్ని రకాల సమస్యలు నయమవుతాయా?
తులసి నీళ్లు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి నిపుణులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 01:00 PM, Wed - 20 November 24

భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే తులసి మొక్క గురించి మనందరికీ తెలిసిందే. ఈ తులసి మొక్క వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. తులసి మొక్కను పూజించడంతోపాటు ఎప్పటి నుంచో ఆయుర్వేదంలో కూడా వినియోగిస్తూ వస్తున్నారు. తులసి మొక్క ఆకులు అలాగే విత్తనాలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఇన్ని మంచి ప్రయోజనాలు ఉన్న ఈ తులసి మొక్కను నీటిలో కలుపుకొని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తులసిలో ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్, ముఖ్యమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తటస్తం చేయడానికి సహాయపడతాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుందని, అలాగే కణాలను దెబ్బతినకుండా రక్షిస్తాయని చెబుతున్నారు. తులసి ఇమ్యునోమోడ్యులేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అంటే ఇది శరీరం రోగనిరోధక ప్రతి స్పందనను పెంచడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. తులసి కలిపిన నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుందట.
అలాగే మీ శరీరాన్ని అంటువ్యాధులకు మరింత తట్టుకునేలా చేస్తుందని చెబుతున్నారు. అలాగే జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుందట. గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు. అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా తప్పుతుందని చెబుతున్నారు. తులసి నీటిని ఉదయాన్నే పరగడుపున, రోజంతా వాటర్ బాటిల్ లో కలుపుకుని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్, క్రిములు బయటకు వెళతాయి. జీర్ణ సంబంధ వ్యాధులు కూడా దూరమవుతాయని చెబుతున్నారు. ఒత్తిడి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చట.
తులసి నీటిని తాగడం వల్ల ఒత్తిడి, యాంగ్జైటీ తగ్గిపోతాయట. దగ్గు, జలుబు, ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించడానికి తులసిని ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారని చెబుతున్నారు. తులసిలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి నోటి ఇన్ఫెక్షన్ లతో పోరాడటానికి, మొత్తం నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. తులసి నీటితో గార్గ్లింగ్ చేయడం వల్ల చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసన కూడా తగ్గుతుందని చెబుతున్నారు.