Pains: ఒళ్లు నొప్పులా…అయితే క్యాన్సర్ సంకేతాలు కావొచ్చు…!!
క్యాన్సర్.....ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతోంది. గతంతో పోలిస్తే...నేడు క్యాన్సర్ రిస్క్ ఎక్కువైంది.
- By Hashtag U Published Date - 07:45 AM, Sat - 21 May 22
క్యాన్సర్…..ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతోంది. గతంతో పోలిస్తే…నేడు క్యాన్సర్ రిస్క్ ఎక్కువైంది. దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. వైద్యులు కూడా కచ్చితంగా ఏమీ చెప్పడం లేదు. కాబట్టి ముందస్తు స్క్రీనింగ్ ఒక్కటే ఈ మహమ్మారి బారిని నుంచి బయటపడే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.
క్యాన్సర్ ను ముందస్తు దశలో గుర్తించినట్లయితే…చికిత్సతో నయం చేసుకోవచ్చు. ఈ వ్యాధి మూడు లేదా నాలుగో దశకు విస్తరిస్తే దాని నుంచి బయటపడటం చాలా కష్టం. క్యాన్సర్ అడ్వాన్స్ డ్ దశకు చేరిన తర్వాతే చాలా మందిలో బయటపడుతోంది. అప్పుడు కానీ వారిలో లక్షణాలు బయటపడటం లేదు. కానీ కొన్ని సంకేతాలను బట్టి ప్రమాదాన్ని ముందుగానే తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.
శరీర భాగాల్లో నొప్పి…
ఒళ్లు నొప్పులు క్యాన్సర్ కు సూచికగా తీసుకోవచ్చు. ఇది కూడా ముందస్తుగా కనిపించే లక్షణం. క్యాన్సర్ శరీరంలోని నరాలు, అవయవాలకు విస్తరించినట్లు తెలియజేసే సంకేతం. నొప్పి దీర్ఘకాలంగా ఉన్నట్లయితే…మందులు వేసుకున్నా నయం కానట్లయితే…అప్పుడు క్యాన్సర్ గా అనుమానించడం వల్ల నష్టం లేదు. ఏ భాగంలో క్యాన్సర్ కణాలు డెవలప్ అవుతాయో ఆయా భాగాల్లో నొప్పిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఎందుకు?
క్యాన్సర్ లో ట్యూమర్లు ఏర్పడతాయన్న సంగతి తెలిసిందే. ఈ ట్యూమర్ పెరుగుతూ ఎముకలు, నరాలు, ఇతర అవయవాలను ఒత్తిడికి గురి చేసినప్పుడు నొప్పి వస్తుంది.
నొప్పుల్లో రకాలు…
సోమాటిక్: ఎక్కువమందిలో క్యాన్సర్ కారణంగా కనిపించేది ఒళ్లు నొప్పులే. ఒళ్లు సలపులు, తిమ్మిర్లు కనిపిస్తాయి. మధ్య మధ్య వచ్చి పోతుంటాయి లేదంటా అలాగే కొనసాగొచ్చు.
న్యూరోపతిక్: క్యాన్సర్ లో న్యూరోపతిక్ నొప్పి కూడా వస్తుంది. క్యాన్సర్ కణాల కారణంగా నరాలు దెబ్బతింటే ఈ నొప్పి వస్తుంది. లేదా క్యాన్సర్ కు తీసుకునే కీమోథెరపీ, రేడియో థెరపీలోనూ కనిపిస్తుంది.
విసెరల్ : అంతర్గత అవయవాల్లోనూ నొప్పి కనిపించే ఛాన్స్ ఉంటుంది. ఇలా వచ్చే నొప్పుల్లో 28శాతంం క్యాన్సర్ వల్లే ఉంటున్నాయి. ఛాతీ, ఉదరం, పొత్తి కడుపు భాగంలోనొప్పి అదేపనిగా వచ్చినట్లయితే క్యాన్సర్ స్క్రీన్ కు వెళ్లడం మంచిది. దీర్ఘకాలం పాటు శరీర భాగాల్లో ఎక్కడైనా నొప్పి వచ్చినట్లయితే…క్యాన్సర్ లేదని నిర్థారించుకోవాలి.
క్యాన్సర్ నొప్పి మోస్తరుగా కానీ…తీవ్రంగా, మంటగా అనిపిస్తుంది. నొప్పి ఉండొచ్చు..లేదంటే వచ్చి పోతుండొచ్చు…తక్కువ లేదా ఎక్కువగా లేదా తీవ్రంగా ఉండొచ్చు. అందుకని నొప్పి తగ్గకపోయినట్లయితే…అదే పనిగా వస్తుంటే వైద్యులను సంప్రదించి కారణాలను గుర్తించాలి.
Related News
Health: జీడిపప్పు తినడం వల్ల మగవాళ్లకు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా.. అవేంటో తెలుసా
Health: పురుషులు జీడిపప్పు తినడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది వారి సంతానోత్పత్తిని పెంచుతుంది. టెస్టోస్టెరాన్ స్థాయిని కూడా మెరుగుపరుస్తుంది. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు వంటి పోషకాలు జీడిపప్పులో ఉంటాయి. జీడిపప్పు తినడం వల్ల పురుషులు చాలా ప్రయోజనాలను పొందుతారు. ఇది వారి సంతానోత్పత్తిని పెంచుతుంది .టెస్టోస్టెరాన్ స్థాయిని కూడా మెరుగుపరుస్తుంది. కార్బోహైడ్రేట్�