French Fries: ఫ్రెంచ్ ఫ్రైస్ తెగ తినేస్తున్నారా.. అయితే ఈ ఒక్కటి తెలిస్తే చాలు లైఫ్ లో మళ్ళీ వాటి జోలికి వెళ్లరు!
స్నాక్స్ రూపంలో తినే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కువగా తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 02:00 PM, Sat - 29 March 25

మన వంటింట్లో దొరికే బంగాళదుంపతో తయారు చేసుకొని తినే వంటల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఒకటి. ఈ ఆహార పదార్థాన్ని చిన్న పిల్లలు యువత ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు. బయట ఏదైనా హోటల్స్ కి రెస్టారెంట్స్ కి వెళ్తే చాలు ఎక్కువగా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ని ఆర్డర్ చేసుకొని తింటూ ఉంటారు. నూటికి రుచిగా కనిపిస్తాయి అని చాలామంది వీటిని ఆన్లైన్లో కూడా పెట్టి మరి తింటూ ఉంటారు. కానీ ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఫ్రెంచ్ ఫ్రైస్ తినడానికి ఆరోగ్యంగా అనిపించినప్పటికీ ధూమపానంతో సమానమైన ప్రమాదాలను కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
వేయించిన ఆహారాలలో ట్రాన్స్ ఫ్యాట్స్ సాధారణంగా కనిపిస్తాయట. అధిక ఉష్ణోగ్రతల వద్ద నూనె వేడి చేయడం ద్వారా ఇవి ఉత్పత్తి అవుతాయట. అక్కగా నూనెను ఎక్కువ సార్లు ఉపయోగించడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ స్థాయిలు పెరుగుతాయట. కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయట. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ ని తరచుగా తినడం వల్ల బరువు పెరగడం, గుండె సమస్యలు, క్యాన్సర్ ప్రమాదం పెరగడం జరుగుతుందట. కాగా ఫ్రెంచ్ ఫ్రైస్ అధిక ఉష్ణోగ్రతల వద్ద నూనెలో డీప్ ఫ్రై చేసి తయారు చేస్తారు. ఈ ప్రక్రియలో అనారోగ్యకర సమ్మేళనాలు ఏర్పడతాయట. ఫ్రెంచ్ ఫ్రైస్ వేయడానికి ఏ నూనె ఉపయోగించారో, ఆ నూనె ఎన్నిసార్లు తిరిగి ఉపయోగించారో తెలియదు.
అలాగే ఆ నూనెను పదేపదే వేడి చేయడం ద్వారా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఏర్పడతాయట. ఇవి గుండెకు హాని కలిగిస్తాయట. ట్రాన్స్ ఫ్యాట్స్ శరీరంలో పేరుకుపోయి కార్డియోవాస్కులర్ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయని చెబుతున్నారు. దీర్ఘకాల నష్టం కలిగిస్తాయట. అదేవిధంగా ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం ధూమపానం కంటే హానికరమట. ధూమపానం గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలకు కారణమవుతుందని చెబుతున్నారు. కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ వినియోగం కూడా తీవ్ర పరిణామాలను కలిగిస్తుందట. ఇందులోని ఉప్పు అధిక ఉప్పు రక్తపోటును పెంచుతుందట. హైపర్‌టెన్షన్ గుండె జబ్బులు, స్ట్రోక్‌కు కారణమవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే అధిక రక్తపోటు, గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు. కాబట్టి పైకి అందంగా తినడానికి రుచిగా అనిపించినప్పటికీ తినక పోవడమే మంచిదని చెబుతున్నారు.