Secunderabad Alpha Hotel : ఇది తెలిస్తే మీరు ఎప్పుడు అల్ఫా హోటల్‌కు వెళ్లరు..!!
పాడైపోయిన మటన్‌తో బిర్యానీ తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. తయారు చేసిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టి దాన్నే వేడి చేసి కస్టమర్లకు ఇస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు
- By Sudheer Published Date - 03:47 PM, Thu - 20 June 24

ప్రస్తుతం జనాలంతా హోటల్ ఫుడ్ (Hotel Food) కు అలవాటు పడ్డారు. ఇంట్లో వంట చేసుకోవడం మానేసి..రోడ్ సైడ్ , హోటల్ ఫుడ్ ను ఎక్కువగా తింటుండడం తో నగరం లో వేలసంఖ్యలో హోటల్స్ పుట్టుకొస్తున్నాయి. రకరకాల ఆఫర్లు పెట్టి కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ఇదే క్రమంలో ప్రముఖ హోటల్స్ దగ్గరి నుండి చిన్న చితక హోటల్స్ వరకు ఆహార భద్రత నియమాలను పాటించకుండా నడుపుతుండడంతో హోటల్స్ లలో ఫుడ్ తిన్న వారంతా హాస్పటల్ పాలవుతున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్దీ రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్ లలో తనిఖీలు చేస్తూ.. సదరు హోటల్ యాజమాన్యాలు ఫుడ్ విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తున్నారా..లేదా అని తనిఖీలు చేస్తూ..ఎక్కడిక్కడే నోటీసులు జారీ చేయడం..సీజ్ చేయడం చేస్తూ వస్తున్నారు. వీరి తనిఖీల్లో ప్రముఖ హోటల్స్ సైతం ఫుడ్ జాగ్రత్తలు పాటించడం లేదని తేలింది.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా సికింద్రాబాద్‌లోని ఆల్ఫా (Secunderabad Alpha Hotel), రాజ్ బార్ అండ్ రెస్టారెంట్, సందర్శిని హోటళ్లలో ఆహార భద్రతా టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ హోటళ్లలో అపరిశుభ్రతతో పాటు సరైన ఆహార భద్రత ప్రమాణాలు పాటించలేదని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్ అంటే అందరికి సుపరిచితమే. పక్కపక్కనే రైల్వే స్టేషన్ , బస్ స్టేషన్ ఉండడం , షాపింగ్ కోసం వచ్చే వారు, ఇతర పనులు మీద వెళ్లిన వారు, ముఖ్యంగా విద్యార్థులు ఆల్ఫా హోటల్లో తినడానికి ఇష్టపడుతుంటారు. ఆ హోటల్లో విక్రయించే బేకరీ వస్తువులు, బిర్యానీ తినడానికి మక్కువ చూపిస్తుంటారు. తక్కువ ధరకు టేస్టీ ఫుడ్ దొరుకుతుందని ఎప్పుడు వెళ్లినా అక్కడ రద్దీగా ఉంటుంది.
అలాంటి ఈ హోటల్ లో కూడా ఆహార భద్రతను పాటించడం లేదు. ఆల్ఫా హోటల్లో టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు చేయగా పాడైపోయిన మటన్‌తో బిర్యానీ తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. తయారు చేసిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టి దాన్నే వేడి చేసి కస్టమర్లకు ఇస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. హోటల్లో ఎలుకలు తిరుగుతూ ఉండడం, దుమ్ము ధూళితో అపరిశుభ్ర వాతావరణం కలిగి ఉందని , హోటల్లో తయారు చేసే బ్రెడ్‌తో పాటు ఐస్‌క్రీమ్ వంటివి ఎక్స్‌పైరీ డేట్ లేకుండా ఉన్నాయని గుర్తించిన అధికారులు ఆల్ఫా హోటల్‌కు నోటీసులు జారీ చేసి లక్ష రూపాయలు ఫైన్ విధించారు. ఇక ఇప్పటికైనా తక్కువ ధరకే బిర్యానీ వస్తుందని కక్కుర్తిపడి తింటే..హాస్పటల్ లో ఆస్తులు అమ్ముకొని వైద్యం చేసుకొనే పరిస్థితి వస్తుంది జాగ్రత్త.
Food Safety Alert: Alpha hotel Secunderabad faces case
The Food Safety Commissioner's Task Force inspected Alpha Hotel, Secunderabad. Findings included improper raw meat storage, unhygienic conditions, and products without batch numbers.
Alpha brand icecream and bread packets… pic.twitter.com/gak6qj6sk9
— Sudhakar Udumula (@sudhakarudumula) June 20, 2024
Read Also : Radha Krishna: మీ ఇంట్లో రాధాకృష్ణుల ఫోటోలు పెట్టుకుంటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?