Health Tips: టీ తో పాటు రస్క్ బిస్కెట్స్ తింటున్నారా.. అయితే ఇది మీకోసమే?
టీ లేదా కాఫీ కాంబినేషన్ లో తీసుకోవడం అసలు మంచిది కాదట.
- By Anshu Published Date - 10:00 AM, Wed - 9 October 24

మనలో చాలామందికి టీ తాగే సమయంలో రస్కులు తినే అలవాటు ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది వీటిని తెగ ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే ఈ రస్కులు ఆరోగ్యానికి అంత మంచిది కావు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ముఖ్యంగా టీ లేదా కాఫీ కాంబినేషన్ లో తీసుకోవడం అసలు మంచిది కాదట. మరి టీ తో పాటు రస్కులు తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ రస్క్ మీ అధికంగా శుద్ధి చేసిన పిండి నూనెతో తయారు చేస్తారు. అందుకే వీటిని రోజు తినటం అనారోగ్యం. బ్రెడ్ కంటే రస్కులు అధికంగా క్యాలరీలను కలిగి ఉంటాయట.
రస్క్ అనేది కేవలం డిహైడ్రేటెడ్ బ్రెడ్. అంటే బ్రెడ్ లోంచి తేమను పూర్తిగా తొలగిస్తే అది రస్క్ కింద మారుతుంది. దీనికి చక్కెరను జోడించడం వల్ల రుచికరంగా చేస్తారు. ఇదంతా మిగిలిపోయిన బ్రెడ్ తో తయారు చేస్తారని మనలో చాలామందికి తెలియదు. అలాగే రస్కుల తయారీలో వాడే నూనె కూడా మంచిది కాదట. ఈ నూనె శరీరంలో ఎక్కువగా చేరటం వల్ల రక్తనాళాల్లోని రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యలు వస్తాయని, దీని వలన గుండెపోటు కూడా రావచ్చని చెబుతున్నారు. అలాగే రోజు రస్కులు తినడం వల్ల అందులో ఉండే పంచదార మీకు మధుమేహ సమస్యలను, గుండె సమస్యలను ఉందని చెబుతున్నారు. కిడ్నీ సమస్యలు చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయట.
రస్కులలో యాంటీ న్యూట్రియెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరం పోషకాలు సంగ్రహించకుండా అడ్డుకుంటుందట. అలాగే రెగ్యులర్ గా టీ తో కాంబినేషన్ గా రస్కులు తీసుకోవడం వలన పేగులకి పొక్కులు సమస్యని కలిగిస్తాయని చెబుతున్నారు. ఇది గ్యాస్, అజీర్ణం అలాగే కడుపులో ఇతర సమస్యలకు దారితీస్తుందట. అలాగే రస్కులో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఫుడ్ ఎడిటింగ్ ప్రెజర్వేటివ్ లు కలుపుతారు. అందుకే రస్కులు ఎక్కువగా తింటే స్థూలకాయం సంభవిస్తుంది. కాబట్టి టీ కాంబినేషన్ తో రస్కులు వాడకపోవడం మంచిదని చెబుతున్నారు.