Break Fast: బ్రేక్ ఫాస్ట్ లో దోస,ఇడ్లీ తింటే బరువు పెరుగుతారా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!
బ్రేక్ ఫాస్ట్ లో దోస ఇడ్లీ ఎక్కువగా తింటే నిజంగానే బరువు పెరుగుతారా, ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 03:45 PM, Wed - 5 February 25

మామూలుగా చాలామందికి ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసే అలవాటు ఉంటుంది. అయితే ఈ బ్రేక్ ఫాస్ట్ గా ఎక్కువ శాతం టిఫిన్లే తింటూ ఉంటారు. ఉగ్గాని బజ్జి, దోస, పెసరట్టు ఇడ్లీ వంటివి ఎక్కువగా తింటూ ఉంటారు. చాలా వరకు చాలామంది ఇడ్లీ దోశలు ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ ఇడ్లీ దోశలు బ్రేక్ ఫాస్ట్ లో ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని చాలామంది అంటూ ఉంటారు. అందుకే చాలామంది ఇడ్లీ దోసెను అవాయిడ్ చేస్తూ ఉంటారు..
మరి నిజంగానే ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ రూపంలో తీసుకునే ఇడ్లీలు దోశల వల్ల బరువు పెరుగుతారా ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ తినడం మంచిదే. వాటిని తినడం వలన ఎలాంటి బరువు పెరగరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు ఉంటాయి. కాబట్టి వాటిని తినడం వలన ఎలాంటి బరువు పెరగరట. వీటిని తినడం ఆరోగ్యానికి మంచిదేనని చెబుతున్నారు. అయితే వీటిని చేసుకునేందుకు ఇందులో వినియోగించే నూనె, చట్నీల్లో వినియోగించే మసాలాలు వలన బరువు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దోశ, ఇడ్లీల వల్ల బరువు పెరగడానికి గల కారణాల విషయానికి వస్తే..
దోశ, ఇడ్లీలలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించినప్పటికీ, ఎక్కువగా తీసుకోవడం వల్ల కొవ్వుగా మారుతాయట. అలాగే దోశ వేయడానికి నూనె ఎక్కువగా వాడతారు. దీనివల్ల క్యాలరీలు పెరుగుతాయట. నూనె వల్ల కొవ్వు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయట. అలాగే దోశ, ఇడ్లీలు ఎంత పరిమాణంలో తింటున్నారనేది కూడా ముఖ్యం అని చెబుతున్నారు. ఇలాంటి వాటిని ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందట. కాబట్టి దోసె ఇడ్లీ తినాలి అనుకున్న వారు ననూనెను తక్కువగా ఉపయోగించాలట..దోశ, ఇడ్లీలకు బదులుగా ఉప్మా, పొంగల్, పెసరట్టు వంటి ఇతర ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ అని చెబుతున్నారు.