Dry Fish: హార్ట్, షుగర్ సమస్యలు ఉన్నవారు ఎండు చేపలు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ఎండు చేపలు తినడం వల్ల ఇలాంటి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే షుగర్, హార్ట్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ ఎండు చేపలను తినవచ్చా, తింటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 02:00 PM, Wed - 19 March 25

ఎండు చేపల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనం అందరికీ తెలిసిందే. ఎండు చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఎన్నో రకాల సమస్యలను కూడా తగ్గిస్తాయట. కానీ చాలామంది వీటి వాసన కారణంగా వీటిని తినడానికి అస్సలు ఇష్టపడరు. మామూలు చేపలతో పోలిస్తే ఈ ఎండు చేపల వాసన మరింత ఘాటుగా ఉంటుందని చెప్పాలి. ఎండు చేపలు ఎముకలను దంతాలను బలపరుస్తాయట. అలాగే ఇందులో రోగనిరోధక శక్తిని పెంచి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు.
జలుబు దగ్గు సమస్య ఉన్నవారు ఎండు చేపల కూర తినడం చాలా మంచిదని చెబుతున్నారు. అదేవిధంగా మూత్రాశయం, అండాశయం, గర్భాశయం లాంటి సమస్యలు ఉన్న మహిళలకు ఎక్కువగా వస్తాయి వాటిని పరిష్కరించడానికి ఇది సహాయపడుతుందని చెబుతున్నారు. ఎండు చేప వాతం, పిత్తం, రక్త ప్రసరణ లాంటి సమస్యలను నయం చేస్తుందట. అలాగే పాలిచ్చే తల్లులు ఎండు చేప తింటే పాల ఉత్పత్తి పెరుగుతుందని చెబుతున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నవారు ఎండు చేపలు తినకూడదు అన్న విషయానికి వస్తే..
గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఎండు చేప అసలు తినకూడదట. ముఖ్యంగా, రక్తపోటు, షుగర్ ఎక్కువగా ఉన్నవారు ఎండు చేపను ముట్టుకోకూడదని, చర్మ సమస్యలు లేదా అలెర్జీలు ఉన్నవారు కూడా ఎండు చేపను తినకూడదని, అలా తింటే దద్దుర్లు, దురద, పొక్కులు లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. కాబట్టి షుగర్ అలాగే హార్ట్ సమస్యలతో బాధపడుతున్న వారు ఎండు చేపలు తినక పోవడమే మంచిది. ఒకవేళ మీకు తినాలి అని ఉంటే ఈ విషయం పట్ల వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.