Insect Remove From Ear: చెవిలోకి పురుగులు వెళ్లాయా.. అయితే వెంటనే ఇలా చేయండి.. పురుగులు బయటకు వస్తాయి!
చెవిలోకి పురుగులు వెళ్లాయి అని ఏవేవో పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్న వారు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటిస్తే వెంటనే ఆ పురుగులు బయటికి వచ్చేస్తాయని చెబుతున్నారు.
- By Anshu Published Date - 04:00 PM, Mon - 26 May 25

మామూలుగా మనం కొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ చెవిలోకి దోమ పురుగు చిన్న చిన్న కీటకాలు వంటివి వెళ్తూ ఉంటాయి. కొన్నిసార్లు చీమలు అంటే కూడా వెళ్తూ ఉంటాయి. అలా లోపలికి వెళ్లిన పురుగులు చెవిలో మెదులుతూ ఒక రకమైన ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. వాటి కారణంగా చెవి నొప్పి చెవి పోటు వంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి.. పురుగులు లోపలికి వెళ్లడం ఈజీనే కానీ చెవిలో నుంచి బయటకు రావడం అనేది చాలా కష్టం. కొన్నిసార్లు వైద్యుల వద్దకు కూడా వెళ్లాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. చాలామంది పురుగులు లోపలికి వెళ్లిన వెంటనే ఏదైనా మస్తు తీసుకొని దానిని బయటకు తీసే ప్రయత్నం చేస్తారు. ఎంతమంది లోపలికి నీరు పోస్తూ ఉంటారు.
ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన ప్రయత్నాలు చేస్తుంటారు. వీటి వల్ల కొన్నిసార్లు చెవి నొప్పి ఇంకా ఎక్కువ అవ్వవచ్చు. ఎందుకంటే చెవి లోపలి భాగాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఏదైనా వస్తువులు పెట్టినప్పుడు లోపల కర్ణభేరికి తగిలితే విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. చెవిలో పురుగు ప్రవేశిస్తే, మొదట చీకటి గదిలోకి వెళ్లి టార్చ్ లేదా మొబైల్ లైట్ ను చెవిలో చూడాలి. ఎందుకంటే కొన్ని పురుగులు వెలుతురు చూసి వెంటనే బయటకు వచ్చేస్తాయి. మీ చెవిలోకి చీమలు, పురుగులు ఏమైనా వెళ్లినప్పుడు ఆలివ్ లేదా బేబీ ఆయిల్ చుక్కలను చెవిలో వేస్తే, పురుగులు చెవిలో ఉండలేక ఆ నూనెతో కలిసి బయటకు వస్తాయట. లేదంటే గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి కొన్ని చుక్కలు చెవిలో వేయాలి. ఉప్పు కలిపిన నీరు పురుగుకు సహించదు.
కాబట్టి వెంటనే చెవి నుంచి బయటకు వస్తుందట. చెవిలో ఉన్న పురుగు బయటకు రావడానికి, దూదిని ఆల్కహాల్‌లో ముంచి చెవి బయటి భాగంలో ఉంచితే, పురుగులు చెవి నుంచి బయటకు వస్తాయట. ఒకవేళ ఇలా చేసినా బయటకు రాకపోతే, కొన్ని చుక్కలు మాత్రమే ఆల్కహాల్ ను చెవిలో వేయాలట. పురుగు వచ్చేస్తుంది. చెవిలోకి పురుగు వెళ్తే బడ్స్ లేదా ఇతర వస్తువులను ఉపయోగించి పురుగులను తీయడానికి ప్రయత్నించకూడదట. ఇలా చేస్తే పురుగు మరింత లోపలికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. అంతేకాకుండా చెవి లోపలి భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుందట. అలాగే చెవిలోకి పురుగు వెళ్తే వెంటనే వేలు పెట్టకండి. దీని వల్ల చెవి నొప్పి పెరుగుతుంది. కొంతమంది చెవిలోకి పురుగు వెళ్తే అగ్గిపుల్లతో తీయడానికి ప్రయత్నిస్తారు. కానీ అలా చేయడం తప్పు. దీని వల్ల చెవికి సమస్య వచ్చి, కొన్నిసార్లు వినికిడి శక్తి కూడా పోవచ్చట. నీరు, నూనె వేసినా చెవిలో ఉన్న పురుగు బయటకు రాకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. అందుకే పడుకునేటప్పుడు శుభ్రంగా ఇల్లు క్లీన్ చేసుకుని పడుకోవాలి.