Drinking Water: ప్రతిరోజు నీరు తాగితే బరువు తగ్గుతారా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!
ప్రతిరోజు నీరు తాగడం వల్ల అధిక బరువు సమస్యను తగ్గించుకోవచ్చని ఈజీగా బరువు తగ్గుతారని చెబుతున్నారు.
- By Anshu Published Date - 05:12 PM, Sat - 8 February 25

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు అధిక బరువు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. బరువు పెరగడం ఎంత ఈజీ. కానీ బరువు తగ్గడం అన్నది చాలా కష్టంతో కూడుకున్న పని. బరువు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇక బరువు తగ్గడం కోసం చాలామంది వ్యాయామాలు, ఎక్సర్ సైజు లు చేయడంతో పాటు డైట్ లు ఫాలో అవుతూ ఉంటారు. హోమ్ రెమెడీస్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయితే బరువు తగ్గడానికి నీరు చాలా సహాయపడుతుందట. నిజానికి తగినంత నీరు త్రాగటం జీవక్రియను పెంచుతుంది.
నీరు జంక్ ఫుడ్ కోసం కోరికలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుందట. సరైన మొత్తంలో నీరు త్రాగటం మంచి జీర్ణక్రియకు, మొత్తం ప్రేగు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందట. బరువు తగ్గడానికి నీరు సరైన ఉష్ణోగ్రతలో ఉండటం ముఖ్యం. ఎటువంటి పరిస్థితులలో చల్లటి నీరు త్రాగటం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. నిజానికి చల్లటి నీటిని సాధారణ శరీర ఉష్ణోగ్రతకు తీసుకురావడానికి మన శరీరం శక్తిని ఉపయోగిస్తుందట. ఇది అదనపు కేలరీలను బర్న్ చేస్తుంది. అదేవిధంగా జీవక్రియ స్థాయిని కూడా పెంచుతుందట. ఈ రెండు కారకాలు కలిసి బరువు తగ్గడానికి సహాయపడతాయట. అయితే నీరు ఎప్పుడు తాగితే బరువు తగ్గుతారు అన్న విషయంకు వస్తే..
త్రాగడానికి సరైన సమయం అంటూ ఏమీ లేదట. మీకు దాహం వేసినప్పుడల్లా నీరు త్రాగాలి. పగటిపూట తగినంత నీరు త్రాగాలి. అలాగే తినడానికి అరగంట ముందు నీరు త్రాగటం వల్ల బరువు తగ్గడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందట. ఇది మీరు తినే ఆహారం శాతాన్ని కూడా తగ్గిస్తుందట. అంతేకాక బరువు నిర్వహణకు సహాయపడుతుందట. కాబట్టి ఏదైనా తినడానికి ముందు ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు త్రాగటం మంచిదని చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు త్రాగాలని చెబుతున్నారు. అలాగే మీకు దాహం వేసినప్పుడల్లా మీ శరీరం మీకు చెబుతుందట. అలాంటప్పుడు వెంటనే నీరు త్రాగటం మంచిది. చాలా సార్లు ప్రజలు ఆకలి, దాహం వల్ల మానసికంగా గందరగోళానికి గురవుతారు. ఈ పరిస్థితిని నివారించడానికి ఏదైనా తినడానికి ముందు సగం గ్లాసు నీరు త్రాగడానికి ప్రయత్నించాలి. దీని తర్వాత కూడా మీకు ఏదైనా తినాలని అనిపిస్తేనే తినాలి. రోజుకు కనీసం రెండు నుండి మూడు లీటర్ల నీరు త్రాగాలని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. నీటితో పాటు అల్లం, మెంతులు, దోసకాయ, కరివేపాకు, పుదీనా, నిమ్మకాయ, ఉసిరి, సోంపు, జీలకర్ర మొదలైనవి కూడా త్వరగా బరువు తగ్గడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.