Chicken: చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా పాలు అసలు తాగకండి.. తాగారో అంతే సంగతులు?
మాములుగా మాంసాహారం తిన్న తర్వాత పాలు పాల పదార్థాలు ఏవి తినకూడదని చెబుతూ ఉంటారు. చికెన్ లేదా మటన్ తిన్న తర్వాత పాలు తాగకూడదని అంటుంటా
- By Anshu Published Date - 09:40 PM, Fri - 5 January 24

మాములుగా మాంసాహారం తిన్న తర్వాత పాలు పాల పదార్థాలు ఏవి తినకూడదని చెబుతూ ఉంటారు. చికెన్ లేదా మటన్ తిన్న తర్వాత పాలు తాగకూడదని అంటుంటారు. ఎందుకంటే మాంసాహారం తిన్న తర్వాత పాలు తాగడం వల్ల శరీరంపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయని, అందుకే చికెన్ లేదా మటన్ తిన్న తర్వాత పాలు తాగకూడదని చెబుతారు. మరి ఇందులో నిజానిజాల విషయానికి వస్తే.. మటన్ తిన్నాక భేషుగ్గా పాలు తాగవచ్చు. ఎందుకంటే వీటి రెండింటి మధ్య ఎలాంటి ప్రతికూల సంబంధం లేదు. వీటి కలయిక వల్ల ఎలాంటి ప్రతికూల ప్రతిచర్యలు జరిగినట్లు శాస్త్రీయ ఆధారాలు లేవు.
ఈ రెండింటిలో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. అందువల్ల చికెన్, మటన్ తిన్న తర్వాత పాలు తాగితే ఆరోగ్యానికి మేలేగానీ ఎలాంటి సమస్యలు తలెత్తవు. చాలా మంది ఆల్కహాల్ సేవించిన తర్వాత వెంటనే పాలు తీసుకోకూడదని చెబుతుంటారు. కానీ వెంటనే కాకుండా కొంత సమయం తర్వాత పాలు తీసుకోవచ్చట. ఎందుకంటే మద్యం సేవించిన తర్వాత పాలు తీసుకోవడం వల్ల ఆమ్లత్వం తగ్గి ఆరోగ్యానికి సహకరిస్తుంది. అందువల్ల, ఆల్కహాల్ తర్వాత పాలు తాగకూడదు అనేది కూడా పూర్తి అపోహ మాత్రమే. అయితే కొంత మందికి పాల ఉత్పత్తులు, మాంసాన్ని కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
కాబట్టి శరీర తత్వాన్ని బట్టి ఆహారాన్ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. కొందరికి జీర్ణశక్తి పరిమితంగా ఉండడం వల్ల ఒకేసారి అంతగా జీర్ణం అవ్వదు. దీనివల్లనే జీర్ణ సమస్యలు, అజీర్తి సమస్యలు వస్తాయి. అయితే ఈ రెంటినీ కలిపి తినడం వల్ల వచ్చే రియాక్షన్‌కి దీనిని లింక్ చేయడం తగదు. అదేవిధంగా పుల్లని పండ్లు తిన్న తర్వాత పాలు తీసుకోవడం వల్ల మాత్రం కొన్ని సమస్యలు వస్తాయట. కాబట్టి నారింజ, నిమ్మ, పైనాపిల్ వంటి పుల్లని పండ్లు తిన్న తర్వాత వెంటనే పాలు తాగడం మానుకోవాలి.