Egg : గుడ్డులోని పచ్చసొన తినట్లేదా?
Egg : పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ, ఇది ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్. దీనివల్ల పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, గుడ్డులోని పచ్చసొనను దూరం పెట్టకుండా, దానిని కూడా ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది
- By Sudheer Published Date - 10:30 AM, Sun - 24 August 25

చాలామంది ప్రజలు గుడ్డులోని పచ్చసొన (Egg yellow) మంచిది కాదని భావించి, దానిని తినకుండా కేవలం తెల్లసొన మాత్రమే తింటారు. కానీ, భారత వైద్య పరిశోధన మండలి (ICMR) ప్రకారం, గుడ్డు పచ్చసొనలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఇది ఆరోగ్యంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదని తెలిపింది. ఇందులో ఉండే విటమిన్ B12, విటమిన్ D, విటమిన్ A, ఐరన్ మరియు ఒమేగా-3 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
Rich Cricketer: సంపాదనలో సచినే టాప్.. ఆ తర్వాతే కోహ్లీ, ధోనీ!
గుడ్డు పచ్చసొనలో ఉన్న పోషకాలతో పాటు, లుటీన్ (Lutein), జియాక్సాంథిన్ (Zeaxanthin) వంటివి కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా కాపాడతాయి. అంతేకాకుండా, ఇందులో ఉండే కొలిన్ (Choline) మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఈ పోషకాలన్నీ శరీరానికి అవసరమైన శక్తిని, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి.
పచ్చసొనలోని పోషక విలువల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, వైద్య నిపుణులు రోజుకు రెండు గుడ్లు (పచ్చసొనతో సహా) తినాలని సూచిస్తున్నారు. దీనివల్ల శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు అందుతాయి. పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ, ఇది ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్. దీనివల్ల పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, గుడ్డులోని పచ్చసొనను దూరం పెట్టకుండా, దానిని కూడా ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.