Cooling Drinks : ఎండాకాలంలో కూలింగ్‌వి తాగుతున్నారా? అయితే జాగ్రత్త..
ఎండలకు మనం ఇంటిలో ఉన్నా, బయటకు వెళ్లినా ఎప్పటికప్పుడు మనకు దాహం వేస్తుంటుంది. అందుకని మనం కూలింగ్ వాటర్(Cooling Water), చల్లని పానీయాలు, డ్రింకులు(Drinks), జ్యుస్ లు తాగుతుంటాము.
- By News Desk Published Date - 10:00 PM, Fri - 2 June 23

ఎండలకు మనం ఇంటిలో ఉన్నా, బయటకు వెళ్లినా ఎప్పటికప్పుడు మనకు దాహం వేస్తుంటుంది. అందుకని మనం కూలింగ్ వాటర్(Cooling Water), చల్లని పానీయాలు, డ్రింకులు(Drinks), జ్యుస్ లు తాగుతుంటాము. కానీ దీని వలన మనం అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసివస్తుంది. వాటిలో మనం మొదట బయట తాగే కూలింగ్ పదార్థాలలో కలిపే ఐస్ మంచిది కాకపోతే మనకు జబ్బులు వస్తాయి. ఇంకా మనకు ఆస్తమా, బ్రామ్కైటిస్, సైనస్ వంటివి ఉన్నవారు చల్లని పదార్థాలు తాగడం, తినడం వలన ఊపిరితిత్తులలో నాళాలు మూసుకుపోయి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. ఇంకా అది నిమోనియాగా మారే అవకాశం ఉంది.
ఎండకు తట్టుకోలేక అందరూ తమ తమ ఇళ్ళల్లో AC , కూలర్లు వాడుతున్నారు. కానీ వాటిని వాడడం వలన కూలర్లలోని దుమ్ము మనకు ఆస్తమా ను కలుగచేస్తాయి. కాబట్టి వాటిని వాడేటప్పుడు ముందుగా మనం కూలర్లలోని మ్యాట్ లను ఇంకా AC లో ఉండే ఫిల్టర్లను శుభ్రం చేసుకోవాలి. అప్పుడే మనకు ఆరోగ్య పరంగా ఎటువంటి నష్టం కలుగదు. రోడ్ల పైన దొరికే చల్లని పానీయాలు తాగడం వలన జలుబు, దగ్గు, జ్వరం వంటివి చిన్న పిల్లలకు, వృద్దులకు వ్యాప్తి చెందుతాయి. ఎందుకంటే వాటిలో దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా నిలువ ఉంటుంది.
చల్లని పదార్థాలు ఎక్కువగా బయటవి తినడం వలన గొంతు నొప్పి సమస్య మామూలుగా మొదలయ్యి మనకు తీవ్రమైన జబ్బులు వచ్చే వరకు దారి తీస్తాయి. కిడ్నీ సమస్యలు, శ్వాసకోశ సమస్యలు, అవయవ మార్పిడి వంటివి చేయించుకున్నవారు ఎండాకాలంలో చల్లని పదార్థాలు బయటవి తాగకూడదు. బయట దొరికే చల్లని పదార్థాలు ఎక్కువగా తాగితే న్యుమోనియా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంటిలో సబ్జా నీళ్ళు, సగ్గుబియ్యం పాయసం, జావలు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ వంటివి తయారుచేసుకొని తాగాలి. ఎండగా ఉంది కదా అని బయట ఏదైనా చల్లగా తాగుదాం అనుకుంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే.