Onions: ఓరినీ.. ఉల్లిపాయ తినడం వల్ల ఏకంగా ఇన్ని లాభాలు కలుగుతాయా?
ఉల్లిపాయ తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం అంటున్నారు. మరి ఉల్లిపాయ ఇలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 04:32 PM, Sun - 18 May 25

పచ్చి ఉల్లిపాయ వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఉల్లిపాయ ఆరోగ్యంతో పాటు అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఉల్లిపాయను ఎన్నో రకాల కూరల్లో ఉపయోగిస్తూ ఉంటారు. కొందరు ఉల్లిపాయను నేరుగా పచ్చిగా తింటూ ఉంటారు. తరచుగా ఉల్లిపాయ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల లాభాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా వేసవిలో తీసుకోవడం వల్ల చల్లగా ఉండి, బాడీలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెంటెయిన్ చేయడానికి ఉల్లిపాయలు బాగా హెల్ప్ చేస్తాయట. కాగా పచ్చి ఉల్లిపాయల్లో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల బాడీ హైడ్రేట్ గా, చల్లగా ఉంటుందట.
వీటితోపాటు ఇందులో ఎసెన్షియల్ ఎలక్ట్రోలైట్స్ అయిన పొటాషియం ఉంటుందట. ఇది బాడీలో ఫ్లూయిడ్‌ని రెగ్యులేట్ చేస్తుందని, మీరు మీ డైట్ లో ఉల్లిపాయల్ని యాడ్ చేస్తే హైడ్రేషన్ అందుతుందని, దీని వల్ల చెమట వల్ల తగ్గిన ఎలక్ట్రోలైట్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయని చెబుతున్నారు. సాధారణంగా ఉల్లిపాయల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తింటే చాలా సేపటి వరకూ కడుపు నిండుగానే ఉంటుందట. దీనివల్ల ఎక్కువగా తినలేము. ఆకలిగా ఉండదు. ఈ కారణంగా త్వరగా బరువు తగ్గవచ్చట. వీటిని తినడం వల్ల జుట్టు, చర్మానికి కూడా మంచిదని చెబుతున్నారు.
వేడి పెరగడం వల్ల వచ్చే మొటిమలు, మచ్చలు సమస్యలు రావు. జుట్టు రాలడం కూడా తగ్గుతుందట. అలాగే ఉల్లిపాయల్లో బాడీని చల్లబరిచే గుణాలు ఉన్నాయి. ఇవి బాడీ టెంపరేచర్ ని తగ్గిస్తాయట. వేడి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయని చెబుతున్నారు. ఎండాకాలంలో ఎక్కువగా జీర్ణ సమస్యలు వస్తుంటాయి. అరగకపోవడం, ఆకలి తగ్గడం వంటివి. అయితే, అలాంటి వాటికి ఉల్లిపాయలు చెక్ పెడతాయట. ఇందులోని డైటరీ ఫైబర్, ప్రిబయోటిక్స్, డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నీ కూడా జీర్ణ వ్యవస్థని కాపాడి హెల్దీగా ఉంచుతాయట. ఫైబర్ రిచ్ ఫుడ్స్ అయిన ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, మలబద్ధకం, గట్ హెల్త్ సరిగా ఉంటుందని, దీని వల్ల ఎండాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయని చెబుతున్నారు..