Mango: మామిడి పండ్ల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా?
ఎండాకాలం వచ్చిందంటే చాలు.. మామిడి పండ్ల సీజన్ మొదలైపోతుంది. ఎక్కడ బట్టినా మామిడి పండ్లే దర్శనమిస్తాయి.
- By Anshu Published Date - 09:55 PM, Sun - 23 April 23

Mango: ఎండాకాలం వచ్చిందంటే చాలు.. మామిడి పండ్ల సీజన్ మొదలైపోతుంది. ఎక్కడ బట్టినా మామిడి పండ్లే దర్శనమిస్తాయి. సమ్మర్ సీజన్ అంటేనే మామిడి పండ్లకు ఫేమస్. వేడి వేడి ఎండలకు తియ్యని మామిడి పండ్లు తింటుంటే ఆ మాజానే వేరు. మామిడిని సీజనల్ ఫ్రట్ గా పిలుస్తారు. ఎండాకాలంలోనే ఇవి కాపుకు వస్తాయి. అయితే రుచిగా ఉండే మామిడి పండ్ల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
మామిడి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫొలేట్, బీటా కెరాటిన్, ఐరన్, కాల్షియం, జింక్, విటమిన్ ఈ లాంటి పోషకాలు ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. వీటి వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయని చెబుతున్నారు. మామిడి పండ్లు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందని, మలబద్ధకం, విరేచనాలు వంటి వాటి నుంచి ఉపశమనం కలుగుతుందని అంటున్నారు. ఇక మామిడి పండ్లలో ఉండే విటమిన్ ఎ, సి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందట.
వృద్ధాప్య ఛాయలను తగ్గించే గునాలు, చర్మం ఆయిల్ ఉత్పత్తిని తగ్గించే గుణాలు మామిడిలో పుష్కలంగా ఉన్నాయి. ఇక బరువు తగ్గడానికి కూడా మామిడి ఉపయోగపడుతుంది. మామిడిలో ఉండే ఫైబర్ వల్ల బరువు తగ్గుతారని చెబుతున్నారు. ఇక మామిడి పండ్లలో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటివి రక్తపోటును నియంత్రిస్తాయి. అలాగే థైరాయిడ్ ని కూడా అదుపు చేస్తుంది. ఇక మామిడిలో ఉండే విటమిన్లు, పొషకాలు గుండె జబ్బులను తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
సమ్మర్ లో వచ్చే మామిడి పండ్ల వల్ల ఇలా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వేసవి కాలంలో మామిడిని తినేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తారు. అయితే మార్కెట్ లో కొనుగోలు చేసేటప్పుడు మంచివి తీసుకోవాలని సూచిస్తున్నారు.