Chai Biscuit: ఉదయాన్నే చాయ్, బిస్కెట్ వద్దు.. ఈ 5 డ్రింక్స్ బెస్ట్..!
చాయ్, బిస్కెట్ (Chai- Biscuit) కాంబినేషన్ అందరికీ హాట్ ఫెవరేట్. కానీ వాటిని కలిపి తీసుకోవడం అనేది చెడ్డ ఆలోచన అని కొందరు డైటీషియన్లు చెబుతున్నారు.టీ, బిస్కెట్ బదులుగా మీరు ఎంచుకోవాల్సిన 5 ఇతర పానీయాలను వారు సూచిస్తున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!
- By hashtagu Published Date - 06:28 AM, Sat - 25 February 23

చాయ్, బిస్కెట్ (Chai- Biscuit) కాంబినేషన్ అందరికీ హాట్ ఫెవరేట్. కానీ వాటిని కలిపి తీసుకోవడం అనేది చెడ్డ ఆలోచన అని కొందరు డైటీషియన్లు చెబుతున్నారు.టీ, బిస్కెట్ బదులుగా మీరు ఎంచుకోవాల్సిన 5 ఇతర పానీయాలను వారు సూచిస్తున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!
■ జీర్ణవ్యవస్థ పనితీరుకు అంతరాయం
మనలో చాలామంది ఉదయాన్నే టీతో రోజును మొదలుపెడతారు. టీ వరకు ఓకే.. కాని ఉదయాన్నే పరికడుపున దానితో పాటు బిస్కెట్ కూడా అంటే డైటీషియన్లు నో చెబుతున్నారు. చాయ్, బిస్కెట్ కాంబినేషన్ లాంగ్ టర్మ్ లో మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఛాన్స్ ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు. వాటివల్ల ఇన్సులిన్ రెసిస్టన్స్ , బెల్లీ ఫ్యాట్, ఎసిడిటీ , గట్ లతో ముడిపడిన ఆరోగ్య సమస్యలు వచ్చే ముప్పు ఉంటుందని అంటున్నారు. చాయ్, బిస్కెట్లు కలిసి జీర్ణవ్యవస్థ పనితీరుకు అంతరాయం కలిగిస్తాయని తెలిపారు. వీటి అధిక వినియోగం మలబద్ధకానికి కూడా దారితీయవచ్చు. ఇవి ఐరన్ వంటి ఇతర పోషకాల శోషణను నెగెటివ్ గా ఎఫెక్ట్ చేస్తుందని కూడా కొందరు వైద్య నిపుణులు నమ్ముతున్నారు.
■ చాయ్ లో బిస్కెట్ కలిసినప్పుడు
చాయ్ లో బిస్కెట్ కలిసినప్పుడు.. బిస్కెట్ లోని చక్కెర కంటెంట్ కారణంగా టీ నెగెటివ్ ప్రభావం మరింత పెరుగుతుంది. శుద్ధి చేసిన చక్కెరతో పాటు బిస్కెట్లలో సాధారణంగా గోధుమ పిండి , సంతృప్త కొవ్వులు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవన్నీ కలిసి ఎసిడిటీ సమస్యలకు మరింత దోహదం చేస్తాయి.
■ మీ కడుపులో సమతుల్యత కోసం
ఉదయం లేవగానే చాయ్, బిస్కెట్లకు బదులు మీ కడుపులో సమతుల్యతను పునరుద్ధరించే ఆల్కలీన్ ఏదైనా త్రాగాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వారి సూచనలు ఇవీ..
★1. సోంపు డికాషన్
మన కిచెన్‌లో తప్పనిసరిగా ఉండే పదార్థాల్లో సోంపు కూడా ఒకటి. మన ఇళ్లలో సోంపును అనేక రకాలుగా ఉపయోగిస్తాం. మసాలా దినుసుగా వంటల్లో వేసుకుంటాం. మౌత్ ఫ్రెష్‌నర్‌గానూ వాడుతారు. తీయగా ఉండే.. ఈ సోంపులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. సోంపును కషాయం లేదా సోంపు నీటిని తాగడం వల్ల.. మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. సోపులో ఉండే పోషకాల వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
సోంపు నీటితో ప్రయోజనాలు: సోంపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి నోటిలో ఉండే బ్యాక్టీరియాను చంపి నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. నోటి దుర్వాసనను శాశ్వతంగా వదిలించుకునేందుకు సోంపు చక్కగా పనిచేస్తుంది. వారానికి రెండుసార్లు సోంపు కషాయం తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
సోంపు డికాషన్ జీర్ణక్రియకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సోంపులో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి కీలక పాత్ర పోషిస్తాయి. సోంపును కషాయం చేసి తాగడం వల్ల గ్యాస్, కడుపునొప్పి, అజీర్ణం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
సోంపు నీరు మీ గట్ వాపును తగ్గించడానికి, GERD (గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి) నుంచి ఉపశమనం కలిగించడానికి హెల్ప్ ఫుల్ గా ఉంటుంది. సోంపులో ఉండే పోషకాలు రక్తాన్ని శుద్ధి చేయడానికి బాగా పని చేస్తాయి. ఫెన్నెల్ వాటర్ తాగడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడానికి దోహదం చేస్తుంది.
★ 2.కొత్తిమీర గింజలతో హెర్బల్ టీ, డికాక్షన్
ప్రతి ఒక్కరి ఇంట్లో రోజూ వంటకాల్లో కొత్తిమీరను ఉపయోగిస్తారు. కొత్తి మీర లేని వంటకాలన్ని అసంపూర్ణంగా ఉంటాయని పెద్దలు చెబుతూ ఉంటారు. చాలా మంది దీనిని దాల్ తడ్కాలో కూడా ఉపయోగిస్తారు. ఇది వంటకాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. కొత్తిమీర వంటకాల రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలను ఇస్తుంది. కొత్తిమీర ఆకులే కాకుండా కొత్తిమీర గింజలు కూడా శరీరానికి చాలా మేలు చేస్తాయి.
ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి మాత్రమే కాకుండా, రోజువారీ ఆహారంలో ఉపయోగించే కొత్తిమీరలో అనేక పోషకాలు కూడా ఉన్నాయి. చాలా మంది కొత్తిమీర గింజలను హెర్బల్ టీ, డికాక్షన్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ గింజలతో చేసిన హెర్బల్ టీని రోజూ అలవాటుగా తాగితే.. అది మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
* జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉన్న వ్యక్తులు కొత్తిమీర గింజలతో చేసిన టీని తాగితే..కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
*వేసవిలో కొత్తిమీర గింజలను నీటిలో నానబెట్టుకుని తాగడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. అలాగే, ఇది శరీరాన్ని రోజంతా తాజాదనంగా ఉంచుతుంది.
* కీళ్ల నొప్పులు ఉన్నవారు క్రమం తప్పకుండా కొత్తిమీరతో చేసిన టీని తాగాలి. ఇది నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది
★ 3. అలోవెరా జ్యూస్
అలోవెరా అనేది అనేక ఔషధ, పోషక ప్రయోజనాలతో కూడిన ఒక మొక్క జాతి. ఈ మొక్క ఆకుపచ్చ, జెల్ నిండిన ఆకులను కలిగి ఉంటుంది. చాలా మంది కాలిన గాయాలు, గాయాల చికిత్స చేయడానికి జెల్‌ను ఉపయోగిస్తారు. ఇది జ్యూస్‌గా కూడా లభిస్తుంది. కలబంద రసం సహజ ఆహార దుకాణాలలో అందుబాటులో ఉంది.
బలవర్ధకమైన కలబంద రసంలో 9.1 గ్రాముల విటమిన్ సి మూలం ఉంటుంది. ఈ విటమిన్ ఒక వ్యక్తి మొత్తం ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది సహజ యాంటీఆక్సిడెంట్ మరియు వాపుతో పోరాడటానికి సహాయపడుతుంది.
మలబద్ధకం చికిత్స: మలబద్ధకంతో బాధపడుతున్నవారికి కలబంద రసాన్ని సహజ భేదిమందుగా ఉపయోగించవచ్చు. మొక్క బయటి భాగం ఆంత్రాక్వినోన్స్ అని పిలువబడే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇవి భేదిమందు ప్రభావాన్ని కలిగి ఉంటాయి.
విటమిన్ సి: బలవర్ధకమైన కలబంద రసంలో 9.1 గ్రాముల విటమిన్ సి మూలం ఉంటుంది. ఈ విటమిన్ ఒక వ్యక్తి మొత్తం ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది సహజ యాంటీఆక్సిడెంట్ మరియు వాపుతో పోరాడటానికి సహాయపడుతుంది. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం నుండి రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడం వరకు అనేక నిర్దిష్ట ప్రయోజనాలను కలిగి ఉంది.
హైడ్రేటెడ్ గా ఉంచటంలో ; రోజంతా పుష్కలంగా ద్రవాలు తాగడం వల్ల ఒక వ్యక్తి హైడ్రేటెడ్‌గా ఉండటానికి తోడ్పడుతుంది. కలబంద రసం చక్కెర పానీయాలు, ఇతర పండ్ల రసాలకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఒక గ్లాస్ కలబంద రసంలో కేవలం 36 కేలరీలు మాత్రమే ఉంటాయి.
★ 4. దాల్చిన చెక్కతో కొబ్బరి నీరు
తెల్లవారుజామున దాల్చిన చెక్క కలిపిన కొబ్బరి నీరు తాగడం వల్ల మీ చక్కెర కోరికలను ఎదురుకోవచ్చు. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. లెప్టిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.
దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే.. రక్తంలోని చక్కెర స్థాయిలపై నియంత్రణ ప్రభావాన్ని చూపుతుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహం ఉన్నవారికి లేదా ఆ పరిస్థితిని అభివృద్ధి చేసే ప్రమాదం ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది. దాల్చినచెక్క నీరు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరుస్తుంది.
దాల్చినచెక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అంటే ఇది శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇన్‌ఫ్లమేషన్ అనేది గాయం లేదా ఇన్‌ఫెక్షన్‌కి సహజ ప్రతిస్పందన. అయితే దీర్ఘకాలిక మంట అనేది గుండె జబ్బులు, క్యాన్సర్, ఆర్థరైటిస్ వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
★ 5. హలీమ్ విత్తనాలతో కొబ్బరి నీరు
హలీమ్ విత్తనాలు(Halim Seeds).. ఈ విత్తనాలను అలీవ్(Aliv), గార్డెన్ క్రెస్(Garden Cress) అని కూడా పిలుస్తారు. వీటిని కొబ్బరి నీటిలో కలిపి ఉదయాన్నే తీసుకోవడం మీ రోజును ప్రారంభించడానికి ఆరోగ్యకరమైన మార్గం మాత్రమే కాదు. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని డైటీషియన్ చెప్పారు. ఈ పానీయంలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. నెత్తిమీద వెంట్రుకల కుదుళ్లను ప్రేరేపించడం ద్వారా అవి రాలిపోకుండా చేస్తుంది.
హలీమ్ విత్తనాల లడ్డులు తినడం వల్ల జుట్టు బలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ లడ్డులను తినడం ద్వారా పీసీఓడీ(PCOD), పీసీఓఎస్(PCOS), ఇర్రేగులర్ పీరియడ్స్(Irregular Periods) కి చెక్ పెట్టచ్చు. ఈ లడ్లను సాధారణంగా చలికాలంలో తయారుచేస్తారు. అలివ్ విత్తనాలు ఒంటికి వేడిచేస్తాయి. ముఖ్యంగా ఈ లడ్లను డెలివరీ తర్వాత మహిళలకు ఇస్తారు. ఇవి పాలిచ్చే మహిళలకు మేలు చేస్తాయి. ఇవి చాలా ఆరోగ్యకరమైనవి కాల్షియం(Calcium), ఐరన్(Iron) పుష్కలంగా ఉంటాయి. హలీమ్ విత్తనాలు విటమిన్లు ఎ, సి(Vitamin A.C)తో పాటు గణనీయమైన మొత్తంలో ఐరన్, కాల్షియం, అయోడిన్(Iodine) మరియు ఫోలిక్ యాసిడ్(Folic Acids) ఉన్నాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్(Minerals) పుష్కలంగా ఉండటం వల్ల క్యాన్సర్(Cancer)తో పోరాడుతుంది.