Djembe Therapy: ఆనందం, ఆహ్లాదం అందించే జెంబే థెరపీ.. ఎలా ?
ఈ ఆలోచన నుంచే జెంబే థెరపీ(Djembe Therapy) పుట్టుకొచ్చింది.
- By Pasha Published Date - 01:01 PM, Mon - 14 April 25

Djembe Therapy: మనం ఎన్నో రకాల థెరపీల గురించి విన్నాం. ఇప్పుడు జెంబే థెరపీ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏమిటిది ? దీనితో ఏవిధమైన చికిత్స చేస్తారు ? అనేది మనం ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Ukraine Partition : జర్మనీలా ఉక్రెయిన్ విభజన.. ట్రంప్ అనూహ్య ప్లాన్ ?!
హైదరాబాద్ నగరంలోనూ..
సంగీతానికి కూడా ఆరోగ్యాన్ని బాగు చేసే శక్తి ఉందని మనం నమ్ముతాం. మనిషిలోని నరనరాల్లో జీవాన్ని, కొత్త శక్తిని నింపే బలం సంగీతానికి ఉందని పెద్దలు చెబుతుంటారు. ఈ ఆలోచన నుంచే జెంబే థెరపీ(Djembe Therapy) పుట్టుకొచ్చింది. జెంబే అనేది ఒక రకమైన ఆఫ్రికన్ డ్రమ్. దీన్ని ఆఫ్రికా ఖండంలోని మాలి, గినియా ఐవరీ కోస్ట్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. దీన్ని ఆఫ్రికాలోని డిజాలా/లెంకె చెట్టుకు చెందిన సింగిల్ పీస్ హార్డ్ వుడ్‌తో తయారు చేస్తారు. ఈ డ్రమ్ పైభాగం (డ్రమ్‌హెడ్) గొర్రె చర్మంతో తయారవుతుంది. మన హైదరాబాద్ నగరం పరిధిలో సాయి కుమార్ అనే ఔత్సాహికుడు ది జెంబే సర్కిల్‌ను ఏర్పాటు చేశాడు. దీనిలో ఎంతోమంది చేరి జెంబే డ్రమ్‌ను వాయించి ఆహ్లాదాన్ని పొందుతున్నారు.
Also Read :Salman Khan: కారులో బాంబు పెట్టి పేల్చేస్తాం.. సల్మాన్‌కు బెదిరింపు
జెంబే థెరపీ.. ఆరోగ్య ప్రయోజనాలు
జెంబే డ్రమ్‌ను వాయించినప్పుడు ఏర్పడే అంతర్గత లయ స్వభావం కారణంగా.. దాన్ని వాయించే వారికి ఆరోగ్యం లభిస్తుందట. జెంబే డ్రమ్‌ను వాయిస్తూ, దాని నుంచి వెలువడే శబ్దాలను వింటే మెదడులో డోపమైన్ స్థాయులు పెరుగుతాయట. ఫలితంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సొంతం అవుతాయట. ప్రత్యేకించి బ్రెయిన్ స్ట్రోక్ రోగులు, హార్ట్ స్ట్రోక్ రోగులు, పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తులకు ఈ థెరపీ ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. ఒంటరిగా జెంబే డ్రమ్‌ను వాయిస్తే ఏకాగ్రత పెరుగుతుందట. అంతేకాదు దీన్ని వాయిస్తూ లోతైన శ్వాస తీసుకుంటే, శరీరంలో మెరుగైన ఆక్సిజన్ ప్రవాహం జరుగుతుందట. ఫలితంగా మానసిక ఒత్తిడి, ఆందోళన నుంచి విముక్తి కలుగుతుందట. స్నేహితులు, సన్నిహితులతో కలిసి సరదాగా జెంబేను వాయిస్తే మనసు చాలా తేలికపడుతుందట. మనిషికి సహనం అలవడుతుందని అంటున్నారు. భుజం కీళ్లు, మోచేతులు లేదా మణికట్టుకు గాయాలున్న వారి జెంబే డ్రమ్ వాయించడానికి దూరంగా ఉంటేనే బెటర్. కార్డియో యాక్టివిటీని తక్కువగా చేయాలని డాక్టర్లు సూచించిన వారు కూడా ఈ డ్రమ్‌ను వాయించొద్దు.
గమనిక: పైన ఇచ్చిన సమాచారాన్ని పాఠకుల అవగాహన కోసం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నాం. దీన్ని ‘హ్యాష్ ట్యాగ్ యూ తెలుగు’ ధృవీకరించదు.