Drinking Water: రోజులో ఒక లీటర్ కంటే తక్కువ నీరు తాగుతున్నారా.. అయితే మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్టే!
Drinking Water: రోజులో ఒక లీటర్ కంటే తక్కువ నీరు తాగడం అస్సలు మంచిది కాదని, దాని వల్ల అనేక సమస్యలు వస్తాయని, బండి షెడ్డుకుపోవడం ఖాయం అని చెబుతున్నారు.
- Author : Anshu
Date : 17-11-2025 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
Drinking Water: నీరు ఆరోగ్యానికి చాలా మంచిది అన్న విషయం తెలిసిందే. నీరు సరిపడా తాగకపోతే అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది నీరు తాగడాన్ని నెగ్లేట్ చేస్తున్నారు. రోజుకు కనీసం లీటర్ నీటిని కూడా తాగడం లేదు. దీని కారణంగా చాలా మంది డీహైడ్రేషన్ బారిన పడుతున్నారు. దాంతో పాటుగా అనేక ఆరోగ్య సమస్యలకు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత నీరు త్రాగటం కూడా చాలా అవసరమని నిపుణలు చెబుతున్నారు.
మన శరీరానికి అవసరమైనంత నీరు తాగకపోతే శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లకుండా మూత్రపిండాలు సరిగా పనిచేయవట. నీరు సరిగ్గా తగ్గకపోవడంతో రక్తపోటులో అస్థిరతలు ఏర్పడతాయట. కడుపు నొప్పి, తల నొప్పి వంటి వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుందని చెబుతున్నారు. అదేవిధంగా రక్తంలో సోడియం స్థాయిలు తగ్గిపోవడం వల్ల వికారం, వాంతులు, మూర్ఛ వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయట. నీరు ఎక్కువగా తాగకపోతే మెదడు కుంచించుకుపోవచ్చట. దీనివల్ల ఏకాగ్రత తగ్గి, ప్రాథమిక పనులు కూడా చేయలేకపోవచ్చని, అలాగే మెదడు సరిగా పనిచేయకపోవడం వల్ల చిరాకు పెరుగుతుందని చెబుతున్నారు.
నీరు సరిగ్గా తగ్గకపోవడంతో శరీరానికి అవసరమైన శక్తి తగ్గి, నీరసంగా అనిపిస్తుందట. మీరు సరైన మొత్తంలో నీరు త్రాగకపోతే, మీరు కీళ్ల నొప్పులను మాత్రమే కాకుండా కండరాల నొప్పులు కూడా రావచ్చట. అయితే మనం ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకు కనీసం 2 నుండి 3 లీటర్ల నీరు త్రాగాలట. 3 లీటర్ల నీరు అంటే దాదాపు 12 గ్లాసులకు సమానం అని చెబుతున్నారు. పొలంలో పనిచేసే వ్యక్తులు ఇంకా ఎక్కువగా తాగవచ్చట. పేగు ఆరోగ్యం నుండి బరువు తగ్గడం వరకు, శక్తిని అందించడం నుండి మూత్రపిండాలు, కాలేయాన్ని శేద్ది చేయడం వరకు, త్రాగునీరు మీ మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.