Health Problems: జీలకర్ర నీటిలో బెల్లం కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
మన వంటింట్లో దొరికే వాటిలో జీలకర్ర,బెల్లం కూడా ఒకటి. ఈ రెండింటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యం
- By Anshu Published Date - 12:00 PM, Mon - 10 June 24

మన వంటింట్లో దొరికే వాటిలో జీలకర్ర,బెల్లం కూడా ఒకటి. ఈ రెండింటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా బెల్లం అలాగే జీలకర్ర నీరు కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. బెల్లం జీలకర్ర నీరు తాగడం వల్ల రక్తహీనత సమస్య ఉండదు. అలాగే అనేక రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ నీటిలో ఆరోగ్యానికి అవసరమైన ఆహారంలో విటమిన్లు క్యాల్షియం ఫైబర్ లభిస్తాయి. కేవలం ఇవి మాత్రమే కాకుండా ఈ జీలకర్ర బెల్లం కలిపిన నీరు తీసుకోవడం వల్ల ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
జీలకర్ర నీళ్లలో బెల్లం ముక్క కలిపి తాగితే అది దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇది అనేక వ్యాధుల నుండి శాశ్వతమైన ఉపశమనం కలిగిస్తుంది. ఇందుకోసం ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా జీలకర్ర వేసి మరిగించి అందులో బెల్లం ముక్క కలపాలి. ఇది మన శరీరానికి అమృతంలా పనిచేస్తుంది. జీలకర్ర బెల్లం నీటిలో ఐరన్, కాల్షియం, డైటరీ ఫైబర్, విటమిన్లు సహా అనేక పోషకాలు ఉన్నాయి. జీలకర్ర బెల్లం నీరు త్రాగడం వల్ల తుంటి, వెన్నునొప్పి నుండి శాశ్వత ఉపశమనం లభిస్తుంది. ఇది నేచురల్ బ్లడ్ ప్యూరి ఫైయర్‌గా పనిచేస్తుంది. ఇది రక్తంలోని మలినాలను తొలగిస్తుంది. అలాగే కడుపు సమస్యలతో బాధపడేవారు జీలకర్ర బెల్లం నీరు త్రాగాలి. ఇది జీర్ణ సమస్యలు, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.
నడుము నొప్పి ఉన్నవారు బెల్లం, జీలకర్ర కలిపి తీసుకోవాలి. బెల్లం, జీలకర్ర నీటిలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి వెన్నునొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. బెల్లం, జీలకర్ర కలిపి తాగితే రక్తహీనత నయం అవుతుంది. ఎందుకంటే బెల్లం, జీలకర్ర నీటిలో ఐరన్ కావాల్సింతగా లభిస్తుంది. ఇది రక్త లోపాన్ని భర్తీ చేస్తుంది. దీనితో పాటు, రక్తంలో ఉన్న మలినాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. స్త్రీలు ఆడపిల్లలు పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు పీరియడ్స్ సమయంలో నొప్పి ఉండకూడదనుకుంటే, రోజూ కనీసం ఒక గ్లాసు బెల్లం నీటిలో టీ స్పూన్ జీలకర్ర పొడిని కలిపి తాగడం మంచిది. ఇందులో ఉండే పోషకాలు పీరియడ్స్‌లో వచ్చే నొప్పి, ఇతర సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాదు తలనొప్పికి కూడా చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. తరచూ తలనొప్పితో బాధపడేవారు రోజూ ఒక గ్లాసు బెల్లం, జీలకర్ర కలిపి తాగాలి. ఇందులో ఉండే పోషకాలు తలనొప్పి నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా ఇతర వ్యాధుల నుండి కూడా రక్షిస్తాయి. బెల్లం, జీలకర్ర నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే సహజ గుణాలు శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరచి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి.