Cucumber Benefits: కీరదోసకాయను తొక్కతో తింటే ఏం జరుగుతుందో తెలుసా?
మనలో చాలామంది ఆహారం విషయంలో ఆరోగ్య విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. దాంతో తినే ఇది ఒక ఆహార పదార్థాలు పండ్ల విషయంలో అనుమాన పడ
- By Anshu Published Date - 06:40 PM, Wed - 17 May 23

మనలో చాలామంది ఆహారం విషయంలో ఆరోగ్య విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. దాంతో తినే ఇది ఒక ఆహార పదార్థాలు పండ్ల విషయంలో అనుమాన పడుతూ ఉంటారు. ముఖ్యంగా కీర దోసకాయ విషయంలో కొంతమందికి సందేహం తలెత్తుతూ ఉంటుంది. అదేమిటంటే కొంతమంది కీరాను తొక్కతో పాటు తింటే మరి కొంతమంది తొక్కను తీసేసి తింటూ ఉంటారు. అయితే మామూలుగా కీర దోసకాయను తొక్క లేకుండా తినాలా తొక్కతో పాటు తినాలా అన్న విషయానికి వస్తే.. కీరా తొక్కలో విటమిన్ కే, విటమిన్ సి సహా చాలా రకాల మినరల్స్, విటమిన్లు ఉంటాయి.
ఇవి శరీరానికి చాలా ప్రయోజనం కల్గిస్తాయి. అందుకే కీరాను ఎప్పుడూ తొక్కతో సహా తినడమే మంచిది. కీరా తొక్కతో తినాలంటే శుభ్రంగా ఉండటమే కాకుండా ఆర్గానిక్ అయి ఉండాలి. లేకపోతే సమస్యలు తలెత్తుతాయి.కీరాను తొక్కతో సహా తినాలంటే ముందుగా కీరాను బాగా శుభ్రం చేసి తరువాత తినాలి. ఎందుకంటే కీరాను నిల్వ చేసేందుకు అసహజమైన సింథటిక్ వ్యాక్స్ వినియోగిస్తూ ఉంటారు. ఈ వ్యాక్స్ నేరుగా కడుపులో వెళితే ఆరోగ్యానికి ప్రమాదకరం. అందుకే కీరాను ఎప్పుడూ తొక్కతో సహా తింటేనే ఆరోగ్యానికి మంచిది. మరి ముఖ్యంగా కీరాను వేడి నీళ్లలో శుభ్రం చేస్తే ఆరోగ్యానికి హాని కలగదు. కీరాను తొక్కతో సహా, ఒలవకుండా తింటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి.
కీరా తొక్కలోనే ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటుంది. అందుకే తొక్క ఒలిచి తింటే ప్రయోజనం ఉండదు. తొక్కతో సహా తింటేనే కీరాతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. కీరా తినడం వల్ల అందులో ఉండే ఫైబర్ కారణంగా మలబద్ధకం సమస్యపోతుంది. ఇది బౌల్ మూమెంట్‌ను వేగవంతం చేస్తుంది. కడుపు శుభ్రం చేస్తుంది. అయితే కీరాను సాధ్యమైనంత ఎక్కువగా ప్రతి డైట్‌లో భాగంగా చేసుకోవాలి. దీనివల్ల స్కిన్ ఏజీయింగ్ ప్రక్రియ అదుపులో ఉంటుంది. దాంతో పాటు కొలేజన్ ఉత్పత్తి మెరుగుపడుతుంది. వేసవిలో రోజూ కీరా తినడం ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. చాలామంది కీరాను బరువు తగ్గించేందుకు తింటూ ఉంటారు. నిజంగానే బరువు తగ్గించేందుకు కీరా అద్భుతంగా ఉపయోగపడుతుంది. డైట్‌లో భాగంగా చేసుకుని కీరా తినడం అలవాటు చేసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. తొక్కతో కూడిన కీరాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.