Corona Returns : హాంకాంగ్, సింగపూర్ లో విజృంభిస్తున్న కొవిడ్ వైరస్
Corona Returns : భవిష్యత్తులో వైరస్ మరింత విస్తరించే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు మళ్లీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది
- By Sudheer Published Date - 06:39 PM, Thu - 15 May 25

కొన్ని నెలల శాంతి అనంతరం కరోనా (Corona ) వైరస్ మళ్లీ దాడికి దిగింది. ఆసియా ఖండంలోని హాంకాంగ్, సింగపూర్ (Hong Kong, Singapore) లలో తాజాగా కొవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ రెండు దేశాల్లో ఒక్క వారం వ్యవధిలోనే వేల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడ్డారు. ముఖ్యంగా సింగపూర్ లో ఒక్క వారం రోజుల్లోనే 14,200 మందికి పైగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే విధంగా హాంకాంగ్ లో చిన్నపిల్లలకు కూడా వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. 17 నెలల, 13 నెలల చిన్నారులకు కరోనా పాజిటివ్ రావడం తల్లిదండ్రులను భయాందోళనలకు గురిచేస్తోంది.
CM Chandrababu: ముగిసిన ఎస్‌ఐపీబీ సమావేశం.. 19 ప్రాజెక్టులకు ఆమోదం!
ప్రస్తుతం సింగపూర్ మరియు హాంకాంగ్ అధికారులు కరోనా విజృంభణను అరికట్టే చర్యలు తీసుకుంటున్నారు. ప్రజారవాణా, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి ముఖ్య ప్రాంతాల్లో మాస్క్ లు ధరించడం తప్పనిసరిగా చేసినట్లు వెల్లడించారు. ఆరోగ్య నిపుణులు మళ్లీ మాస్క్ లను, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు స్కూళ్లలో ఆన్లైన్ తరగతులపై ఆలోచనలు మొదలయ్యాయి.
Anasuya Dating : రామ్ చరణ్‌తో డేటింగ్ చేసేదాన్ని – అనసూయ హాట్ ఆన్సర్
భవిష్యత్తులో వైరస్ మరింత విస్తరించే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు మళ్లీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. టీకాలు తీసుకోవడం, లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవడం, ఇతరులకు దూరంగా ఉండడం వంటి జాగ్రత్తలు పాటించడం ఎంతో కీలకం. ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలను గౌరవిస్తూ మాస్క్ లను మళ్లీ జీవితంలో భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.