Coconut Water: కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీళ్ళు అస్సలు తాగకూడదట!
కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనివల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. కానీ కొంతమంది వీటిని తినక పోవడమే మంచిది అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 10:33 AM, Sat - 12 April 25

కొబ్బరినీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఏడాది పొడవునా ఈ కొబ్బరినీళ్లు తాగవచ్చు. ఆరోగ్యం బాగో లేనప్పుడు, నీరసంగా అనిపించినప్పుడు ఇలా అనేక సందర్భాలలో కొబ్బరి నీరు తాగుతూ ఉంటారు. మరి ముఖ్యంగా వేసవి కాలంలో ఈ కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగుతూ ఉంటారు.. వేసవిలో శరీరం హైడ్రేటెడ్ గా ఉండాలంటే కొబ్బరి నీరు తాగాల్సిందే. అనేక ప్రయోజనాలను కలిగించడంతో పాటు చాలా రకాల సమస్యలకు కూడా మంచిగా పనిచేస్తుంది. ఇకపోతే కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు కొబ్బరినీరు తాగకపోవడమే మంచిదని చెబుతున్నారు.
మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు కొబ్బరినీరు తాగకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. డయాబెటిస్ రోగులకు కొబ్బరి నీళ్లు హానికరమట. కొబ్బరి నీళ్లు తాగితే బ్లడ్ షుగర్ లెవెల్ పెరుగుతుందట. అందుకే మీ బ్లడ్ షుగర్ లెవెల్ ఎక్కువగా ఉంటే, కొబ్బరి నీళ్లు తాగకూడదట. కిడ్నీ సమస్యలు ఉంటే, ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగకూడదట. అలాగే జలుబు, జ్వరం ఉండేవాళ్లు కూడా కొబ్బరినీళ్లు తాగకూడదట. కొబ్బరి నీళ్ల స్వభావం చల్లగా ఉంటుందట..జలుబు, జ్వరం ఉన్నప్పుడు కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యం మరింత దిగజారుతుందట. కొంత మందికి కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అలర్జీ సమస్యలు కూడా వస్తాయట. దీనివల్ల దురద, మంట లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుందట.
కాగా అలాంటివారు కూడా కొబ్బరి నీళ్లు తాగకూడదట.. మీకు రక్తపోటు తక్కువగా ఉంటే, కొబ్బరి నీళ్లు తాగవచ్చు. ఎందుకంటే కొబ్బరి నీళ్లలో ఉండే పోషకాలు రక్తపోటును పెంచడానికి సహాయపడతాయట. కానీ మీ రక్తపోటు ఎక్కువగా ఉంటే, కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెబుతున్నారు. ఇలాంటి సమస్య ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగకపోవడమే మంచిదట.