Children: అనారోగ్య సమయంలో పిల్లలు ఫుడ్ తినడం లేదా.. అయితే ఈ టిప్స్ ఫాలోకండి
- By Balu J Published Date - 11:59 PM, Thu - 9 May 24

Children: పిల్లలు అనారోగ్యంతో ఉన్నప్పుడు తినాలని అనిపించదు. ఆరోగ్యం మరింత బలహీనమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బిడ్డ ఎందుకు సరిగా భోజనం చేయడం లేదని తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. పిల్లలు తినాలంటే…
పిల్లలకు ఆహారం ఇవ్వడానికి కార్టూన్ లేదా హీరో థీమ్‌పై ఫుడ్ అందించడం. ఉదాహరణకు.. వారు సూపర్ హీరోలను ఇష్టపడితే శాండ్‌విచ్‌ను సూపర్ హీరో ఆకారంలో కత్తిరించండి లేదా అన్నం పెట్టాలి. ఇది వారికి ఆహారం తినడం సరదాగా ఉంటుంది. ఆహారం పట్ల ఆసక్తిని పెంచడానికి శాండ్‌విచ్‌లు లేదా ఇతర ఆహార పదార్థాలను నక్షత్రాలు లేదా హృదయాల వంటి సైజులో తయారుచేసిన ఇవ్వాలి. పిల్లలు ఈ రకమైన ఆహారాన్ని చూసినప్పుడు మనసు ఆహారం వైపు మళ్లుతుంది. దీంతో సంతోషంగా తింటారు.
మీ పిల్లలు కొన్ని ఆహారాలను ఇష్టపడితే, వాటిని అతని భోజనంలో చేర్చండి. ఉదాహరణకు, అతను ఒక పండు లేదా కూరగాయలను ఇష్టపడితే, ప్రతిరోజూ అతనికి ఇవ్వండి. దీనితో పిల్లవాడు బాగా తింటాడు. పిల్లలతో కలిసి భోజనం చేయడం వల్ల ఆహారం పట్ల ఆసక్తి పెరుగుతుంది .ఇంట్లో అందరూ కలిసి కూర్చొని భోజనం చేయడం చూస్తే తనకి కూడా తినాలనిపిస్తుంది. రోజులో నిర్ణీత సమయాల్లో పిల్లలకు తేలికపాటి స్నాక్స్ ఇవ్వండి. ఇది వారి ఆకలిని పెంచుతుంది