Vitamin E Capsule: ముఖానికి విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇది మీకోసమే!
ముఖం అందంగా కనిపించడం కోసం, చర్మ సౌందర్యాన్ని మరింత పెంచుకోవడం కోసం విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉపయోగిస్తూ ఉంటారు. మరి ముఖానికి విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉపయోగిస్తే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 09:50 AM, Tue - 29 April 25

మాములుగా ముఖం అందంగా కనిపించడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అందులో భాగంగానే మార్కెట్ లో దొరికే చాలా రకాల బ్యూటీ ప్రోడక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. వాటిలో విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా ఒకటి. అయితే దీనిని ముఖానికి అప్లై చేయవచ్చా, అలా చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. విటమిన్ ఈ ముఖానికి చాలా మంచి గ్లో ఇస్తుంది. మార్కెట్లో విటమిన్ ఈ పుష్కలంగా ఉండే మాయిశ్చరైజర్స్ చాలా ఉన్నాయి. అవి కాకుండా విటమిన్ ఈ క్యాపిల్స్ డైరెక్ట్ గా రాస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయట.
అంతేకాదు ఇవి మనకు చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి. ఈ క్యాప్సిల్స్ లోని ఆయిల్ ని డైరెక్ట్ గా ముఖానికి అప్లై చేయడం వల్ల ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుందట. అంతేకాదు చర్మాన్ని చాలా మాయిశ్చరైజ్డ్ గా ఉంచుతుందట. అలాగే మృదువుగా మారుస్తుందట. ఈ క్యాప్సిల్స్ లోని ఆయిల్ ని డైరెక్ట్ గా ముఖానికి రాసేస్తూ ఉంటారు. అలా కాకుండా క్యాప్సూల్ ను ఫేస్ ఆయిల్ లేదా టోనర్ లో కలపి అప్లై చేయడం మంచిదని చెబుతున్నారు.
విటమిన్ ఈ క్యాప్సూల్స్ ను చర్మంపై పూయడానికి సులభమైన మార్గం ఏమిటంటే, మీ చర్మానికి సరిపోయే మంచి ఫేస్ ఆయిల్ లేదా రోజ్ వాటర్ వంటి సహజమైన ఫేషియల్ టోనర్ తో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. దానికంటే ముందు ముఖాన్ని మంచి క్లెన్సర్ తో శుభ్రం చేసుకోవాలట. ఇప్పుడు క్యాప్సిల్ లోని నూనెను క్లెన్సర్ లో వేసి మిక్స్ చేయాలట. ఈ రెండిటినీ బాగా కలిపి మీ ముఖానికి అప్లై చేయాలి. మంచిగా మసాజ్ చేయడం వల్ల మీ ముఖానికి మంచి గ్లో వస్తుందట. ముఖంపై ఏవైనా మచ్చలు ఉన్నా తొలగిపోతాయట. మీరు మీ ఫేస్ మాస్క్‌కి విటమిన్ ఈ క్యప్సూల్స్ ను కూడా జోడించవచ్చట. ఇది మీ చర్మానికి మరింత పోషణను అందిస్తుందట. మీరు అలోవెరా జెల్, ముల్తానీ మిట్టి లేదా పెరుగు వంటి ఏదైనా సహజమైన ఫేస్ మాస్క్ లో కూడా ఉపయోగించవచ్చట. ఈ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్‌లో బాగా మిక్స్ చేసి ముఖానికి సమానంగా అప్లై చేయాలట. ముఖానికి పట్టించి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలట.