Boiled Egg : వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడేవారు కోడిగుడ్డు తినొచ్చా? వైద్యుల ఏం సలహా ఇచ్చారంటే?
Boiled Egg : కొద్దిగా జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి..ఇలాంటి సాధారణ వైరల్ ఇన్‌ఫెక్షన్ ఉన్నవారు గుడ్డు తినొచ్చా లేదా అనే అనుమానం చాలామందిలో ఉంటుంది.
- By Kavya Krishna Published Date - 05:00 PM, Tue - 26 August 25

Boiled Egg : కొద్దిగా జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి..ఇలాంటి సాధారణ వైరల్ ఇన్‌ఫెక్షన్ ఉన్నవారు గుడ్డు తినొచ్చా లేదా అనే అనుమానం చాలామందిలో ఉంటుంది. గుడ్డులో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు అది జీర్ణం కావడం కష్టమని కొందరు అనుకుంటారు. అయితే ఈ విషయంలో వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
వైరల్ జ్వరం వచ్చినప్పుడు గుడ్డు తినొచ్చా?
వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడేవారు గుడ్డును తినొచ్చని వైద్యులు చెబుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరంతో ఉన్నప్పుడు మన శరీరానికి అవసరమైన పోషకాలను గుడ్డు అందిస్తుంది. గుడ్డులో అధిక ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, ముఖ్యంగా విటమిన్ డి, విటమిన్ బి12, జింక్, సెలీనియం లాంటివి పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్‌ఫెక్షన్ నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి. గుడ్డు తేలికగా జీర్ణమయ్యే ఆహారం కాబట్టి, జ్వరం లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా దీన్ని తీసుకోవడం సురక్షితమే.
ఎల్లో, వైట్ రెండూ ఎలా పనిచేస్తాయి..
గుడ్డులో పసుపు, తెలుపు భాగం రెండూ శరీరానికి మేలు చేస్తాయి. గుడ్డులో తెల్లటి భాగంలో కేవలం ప్రోటీన్లు మాత్రమే ఎక్కువగా ఉంటాయి. అదే పసుపు భాగంలో (ఎల్లో) కొవ్వులు, కొలెస్ట్రాల్‌తో పాటు, విటమిన్ డి, విటమిన్ బి12, జింక్, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకంగా పనిచేస్తాయి. అందుకే, కేవలం తెల్లటి భాగం మాత్రమే తినడం కంటే, గుడ్డు మొత్తం తినడం వల్ల అన్ని పోషకాలూ లభిస్తాయి. అయితే, కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు వైద్యుడి సలహా మేరకు తీసుకోవడం మంచిది. మరికొందరు ఇష్టానుసారంగా గుడ్డు తినడం వలన శీరీరంలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది.
అలర్జీ ఉన్నవారికి గుడ్డు అధికంగా తినడం వలన కండ్లు ఎర్రగా అవ్వడం, తుమ్ములు వంటివి వస్తుంటాయి. అయితే, గుడ్డును ఎలా వండుకుని తింటే మంచిదో కూడా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు నూనె, మసాలాలు ఎక్కువగా ఉండే ఫ్రై చేసిన గుడ్డు లేదా ఆమ్లెట్ తినడం కంటే, ఉడికించిన గుడ్డు లేదా ఉడికించిన గుడ్డు పచ్చసొన (ఎగ్ యోక్) తినడం మంచిది. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు సులభంగా అందుతాయి. అలాగే, శరీరంలో వేడి పెరగకుండా చూసుకోవచ్చు.
మొత్తానికి, వైరల్ ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు గుడ్డు తినడం సురక్షితం మాత్రమే కాదు, అవసరం కూడా. గుడ్డులో ఉండే పోషకాలు మన శరీరాన్ని బలోపేతం చేసి, అనారోగ్యం నుంచి త్వరగా బయటపడటానికి సాయపడతాయి. కాబట్టి, ధైర్యంగా గుడ్డు తినొచ్చు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లైతే వైద్యుడిని సంప్రదించి, సలహా తీసుకోవడం మంచిది.
Telangana High Court : వాన్పిక్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు