Mango: మామిడి పండ్లు ఫ్రిడ్జ్ లో పెట్టి తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
వేసవికాలంలో దొరికే మామిడి పండ్లను ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినవచ్చా, అలా తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 04:34 PM, Mon - 17 March 25

మామిడిపండును పండ్లలో రారాజుగా పిలుస్తూ ఉంటారు. ఈ మామిడి పండ్లు కేవలం వేసవికాలంలో మాత్రమే లభిస్తూ ఉంటాయి. వేసవికాలం వచ్చింది అంటే చాలు చాలామంది మామిడిపండ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ మామిడిపండును ఇష్టంగా తింటూ ఉంటారు. మామిడి పండ్ల కోసం ఏడాది మొత్తం ఎదురు చూసే వారు కూడా ఉన్నారు. అయితే చాలామంది చేసే అతి పెద్ద తప్పు ఏమిటి అంటే ఒకే సారి మామిడి పండ్లను కొని ఫ్రిజ్ లో స్టోర్ చేస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి మంచి చేస్తుందా లేదా ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మామిడి పళ్లను రిఫ్రిజిరేటర్ లో స్టోర్ చేయవచ్చా అంటే చేయవచ్చని కాకపోతే ఎక్కువ రోజులు ఉంచకూడదని చెబుతున్నారు. వీటిని ఫ్రిజ్ లో ఎక్కువ రోజులు ఉంచడం వల్ల మామిడి పండ్లలో ఉండే పోషక విలువలు అనేవి ప్రభావితం అవుతాయట. దీని వల్ల పోషకాలు అనేవి సరిగ్గా శరీరానికి అందవట. దీంతో మామిడి పండ్లు తిన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదట. మామిడి పండ్లను కొనేముందు కొన్ని చిట్కాలు పాటించాలి. అన్ని పండ్లు పండినవే కాకుండా కాస్త పండనవి కూడా తీసుకోవాలని చెబుతున్నారు. అప్పుడు ఒకటే సారి పాడవ్వకుండా ఉంటాయట. మామిడి పండ్లును ఎప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద ఉంచాలని చెబుతున్నారు.
అప్పుడు మామిడి పండు రుచి బావుంటుందట. అలాగే మామిడి పండ్లు కొన్ని రోజులు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచాలనుకుంటే వాటికి ఉన్న పీల్ తీసేసి సీలు చేసిన కంటైనర్స్ లో నిల్వ చేయాలనీ చెబుతున్నారు. ఇలా నెల లేదా రెండు నెలల వరకు ఉంచవచ్చట. అలాగే మామిడి పండ్లు త్వరగా పాడవ్వకుండా, ఫ్రెష్ గా ఉండాలంటే నీటిలో నిల్వ ఉంచాలట. అందుకోసం ఒక పాత్ర తీసుకుని అందులో వాటర్ పోసి మామిడి కాయలు వేసి పాత్రలో ఉంచడం వల్ల మామిడి కాయలు కుళ్లి పోకుండా ఫ్రెష్‌గా ఉంటాయట. అంతేకాకుండా బయట నుంచి తెచ్చిన మామిడి పండ్లను కొద్దిసేపు వాటర్ లో నానబెట్టిన తర్వాతే తినాలని చెబుతున్నారు.