Paneer: మధుమేహం ఉన్నవారు పనీర్ తింటే ఏం జరుగుతుందో తెలుసా?
డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు ఆహారం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఎటువంటి ఆహారం తినాలి అన్నా కూడా సంకోచిస్తూ ఉంటా
- By Nakshatra Published Date - 10:10 PM, Mon - 26 June 23
డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు ఆహారం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఎటువంటి ఆహారం తినాలి అన్నా కూడా సంకోచిస్తూ ఉంటారు. వైద్యులు కూడా డయాబెటిస్ ఉన్నవారు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. ఎందుకంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకునే ఆహార, పానీయాలు వారి శరీరంపై పెను ప్రభావం చూపుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యకరమైన జీవక్రియకు ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా సహాయపడుతాయి. కాబట్టి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. అయితే డయాబెటిస్ ఉన్నవారు పనీర్ తీసుకోవచ్చా?
తీసుకుంటే ఏమైనా సమస్యలు వస్తాయా అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పాలతో తయారు చేసిన పనీర్‌లో క్యాల్షియంతో పాటు ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. శాకాహారులకు ఇది అద్భుతమైన ప్రోటీన్ ఆహారం. ఈ పనీర్ డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లను అందించడమే కాక అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే, పన్నీర్‌ను మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా అనే ప్రశ్న చాలా మందిలో ఖచ్చితంగా తలెత్తుతుంది. పాలతో చేసిన పనీర్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. నిజానికి, పనీర్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచి ఆహార పదార్థంగా చెప్పవచ్చు. ఎందుకంటే పనీర్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఎందుకంటే గ్లైసెమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్ ఆహారాలను నియంత్రిస్తుంది. రక్తంలో చక్కెరపై వాటి ప్రభావాన్ని నియంత్రిస్తుంది. ప్రోటీన్ సాధారణంగా శరీరంలో చాలా నెమ్మదిగా జీర్ణమవుతుంది. అలాగే ఇది కార్బోహైడ్రేట్లను తక్కువ మొత్తంలో వదిలివేస్తుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరగదు. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులకు పన్నీర్ బెస్ట్ ఫుడ్. ముఖ్యంగా టైప్-2 డయాబెటిక్ రోగులకు పనీర్ అద్భుతమైన ఆహారం. కాగా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న అద్భుతమైన ఆహారం పన్నీర్. పన్నీర్ రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచదు. ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. పన్నీర్ రెగ్యులర్‌గా తీసుకుంటే టైప్-2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. పన్నీర్ లో ప్రొటీన్లు వివిధ సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. అదనంగా, పన్నీర్ ఎముకలు గుండె ఆరోగ్యానికి మంచిది. ఇది మంచి జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. పన్నీర్ లో ప్రొటీన్లు ఎక్కువ కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి కాబట్టి, మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని వివిధ మార్గాల్లో తమ ఆహారంలో చేర్చుకోవచ్చు.
Related News
Paneer Benefits: పనీర్ తింటే కలిగే లాభాలు ఇవే.. ఒకసారి తింటే వదిలిపెట్టరు..!
చీజ్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పనీర్ (Paneer Benefits)లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, కాల్షియం, పొటాషియం వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.