Diabetes: డయాబెటిస్ నియంత్రణకు ఒంటె పాలు ఎంతో మేలు చేస్తాయ్.. రోజూ dietలో చేర్చాల్సిన కారణాలు ఇవే!
ఇటీవల జరిగిన కొన్ని శాస్త్రీయ పరిశోధనల ప్రకారం, ఒంటె పాలు మధుమేహ నియంత్రణలో ఉపయోగకరంగా ఉంటాయని వెల్లడయ్యింది.
- By Hashtag U Published Date - 05:29 AM, Thu - 26 June 25

Diabetes and Camel Milk: ప్రస్తుత కాలంలో మధుమేహం బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ వ్యాధి క్రమంగా కళ్ళు, గుండె, మూత్రపిండాలు వంటి ముఖ్యమైన అవయవాలపై ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలంగా మధుమేహం నియంత్రణలో లేకపోతే, అది ప్రాణాంతక స్థితికి దారి తీసే అవకాశం ఉంది. అందుకే జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు అనివార్యం.
ఇటీవల జరిగిన కొన్ని శాస్త్రీయ పరిశోధనల ప్రకారం, ఒంటె పాలు మధుమేహ నియంత్రణలో ఉపయోగకరంగా ఉంటాయని వెల్లడయ్యింది. గల్ఫ్ దేశాల్లో విస్తృతంగా వినియోగించబడే ఈ పాలు, మనదేశంలో ఇంకా ప్రాచుర్యంలోకి రాలేదు. కానీ, ఆరోగ్య ప్రయోజనాల పరంగా ఇది ఎంతో విలువైనది.
ఒంటె పాలలో ఇన్సులిన్ లాంటి ప్రోటీన్లు ఉండటం వల్ల, ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. పరిశోధకుల వివరాల ప్రకారం, రోజూ 4 కప్పుల ఒంటె పాలు తీసుకుంటే దాని ప్రభావం సుమారు 50 యూనిట్ల ఇన్సులిన్‌కు సమానంగా ఉంటుంది. ఇది మధుమేహ నియంత్రణకు ఒక సహజ మార్గంగా చెప్పవచ్చు.
పోషక విలువల పరంగా చూస్తే, ఒంటె పాలు విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకర కొవ్వులు, ప్రోటీన్లు మరియు రోగనిరోధక శక్తిని పెంచే ఇమ్యూనోగ్లోబులిన్లు సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇవి ఇతర పాలు తక్కువ కొవ్వు, తక్కువ చక్కెర కలిగి ఉండటం వల్ల మరింత లాభదాయకంగా మారతాయి.
ఒంటె పాల ఉపయోగాలు:
-
రక్తంలో చక్కెర స్థాయి తగ్గించడంలో సహాయం
-
ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గింపు
-
రక్తపోటు నియంత్రణ
-
రోగనిరోధక శక్తి పెంపు
-
శరీర నొప్పులు, వాపుల నుండి ఉపశమనం
ఆరోగ్య నిపుణుల సూచన మేరకు, రోజూ 500 మిల్లీలీటర్ల ఒంటె పాలను డైట్‌లో చేర్చడం వల్ల మధుమేహ నియంత్రణలో ఉంటుందని తెలుస్తోంది. మందులపై ఆధారపడకుండా ఉండాలంటే, ఆహారపు అలవాట్లలో ఒంటె పాలను చేర్చడం వల్ల చాలా మంచినీ అందించవచ్చు.