Corn silk: వామ్మో.. మొక్కజొన్న పీచు వల్ల అన్ని రకాల లాభాలా?
వయసుతో సంబంధం లేకుండా మొక్కజొన్న ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో చల్లటి వాతావరణంలో వేడివేడిగా కాల్చిన మొక్కజొన్న లేదంటే
- By Anshu Published Date - 10:00 PM, Tue - 15 August 23

వయసుతో సంబంధం లేకుండా మొక్కజొన్న ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో చల్లటి వాతావరణంలో వేడివేడిగా కాల్చిన మొక్కజొన్న లేదంటే ఉడకపెట్టిన మొక్కజొన్నను ఇష్టంగా తింటూ ఉంటారు. అంతేకాకుండా వర్షాకాలం మొదలైతే రోడ్లపై ఎక్కడ చూసినా కూడా ఈ మొక్కజొన్నలు కనిపిస్తూ ఉంటాయి. చాలామంది ఉడకపెట్టిన మొక్కజొన్న కంటే కాల్చిన మొక్కజొన్నని ఇష్టపడుతూ ఉంటారు. ఇక కాల్చిన మొక్కజొన్నకు కొంచెం ఉప్పు కారం, కాస్త నిమ్మ పండు తగిలించుకుని ఆ చల్లటి వాతావరణంలో రుచిని ఆస్వాదిస్తూ తింటూ ఉంటారు. అయితే మొక్కజొన్న తినడం ఆరోగ్యానికి చాలా మంచిది అన్న విషయం మనందరికీ తెలిసిందే.
మొక్కజొన్న వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కేవలం మొక్కజొన్న వల్ల మాత్రమే కాకుండా మొక్కజొన్న పీచు వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం చాలామందికి తెలియదు. మరి మొక్కజొన్న పీచు వల్లే కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మొక్కజొన్న పీచులో పొటాషియం, కాల్షియం, విటమిన్లు బి2, సి, కె వంటి పోషకాలు ఉంటాయి. మొక్కజొన్న పీచుతో టీ చేసుకుని తాగితే ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మొక్కజొన్న పీచు కిడ్నీలకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇది కిడ్నీలలోని ప్రమాదకర టాక్సిన్స్‌ను తొలగించడానికి, కిడ్నీలో రాళ్లను తొలగించడానికి సహాయపడుతుంది.
మొక్కజొన్న పీచుతో తయారు చేసిన టీ తాగితే మూత్రపిండాలలో పేరుకుపోయిన టాక్సిన్స్, నైట్రేట్‌లు తొలగుతాయి. ఈ టీ తరచుగా తాగితే.. కిడ్నీలో రాళ్లు రాకుండా నివారించవచ్చు. మొక్కజొన్న పీచులో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఇది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, మూత్రంలో మంట వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే యూరిన్‌లో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అలాగే మన శరీరంలో ఉన్న అదనపు నీరును, వ్యర్ధాలను బయటకు పంపిస్తుంది. మొక్కజొన్న పీచు టీ ప్రోస్టేట్ గ్రంధిని ఆరోగ్యంగా ఉంచుతుంది. మొక్కజొన్న పీచులో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ మెండుగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి. రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచే ఇన్సులిన్ హార్మోన్‌ను నియంత్రించే గుణాలు ఇందులో ఉన్నాయి. షుగర్ పేషెంట్స్ మొక్కజొన్న పీచు టీ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి .